అమరావతి : పవన్, చంద్రబాబుకు మొహం చెల్లటంలేదా ?

Vijaya

కొద్దిరోజులుగా వీళ్ళిద్దరి ఏడిపుకి జగన్మోహన్ రెడ్డి సరైన సమాధానం చెప్పారు. విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఏపీలో రు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది పారిశ్రామికవేత్తలు  ఎంవోయులు కుదుర్చుకున్నారు. తమ తరపున ఎవరినో పంపకుండా డైరెక్టుగా అధినేతలే సదస్పుకు రావటం చాలా కీలకమనే చెప్పాలి. ముఖేష్ అంబానీ దాదాపు 4 గంటల పాటు సదస్సులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖేష్ కాకుండా కరణ్ అదానీ, కుమారమంగళం బిర్లా, నవీన్ జిందాల్, సుమంత్ సిన్హా, గ్రంధి మల్లికార్జునరావు లాంటి ఎంతోమంది హేమాహేమీలు సదస్సులో పాల్గొన్నారు.ఇంతమంది వచ్చి ఎంవోయులు కుదుర్చుకున్నారు కాబట్టి సదస్సు గ్రాండ్ సక్సెస్ అనేచెప్పాలి. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్షాల నోళ్ళు పడిపోయాయి. సదస్సు గ్రాండ్ సక్సెస్ అని అంగీకరించలేక కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నట్లుగా పనికిమాలిన ఆరోపణలు ఏవేవో చేస్తున్నాయి. ఇక ఎల్లోమీడియా ఏడుపు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సదస్సులో భోజనాల దగ్గర తోపులాట జరిగింది, కిట్లు అందరికీ రాలేదనే పాయింట్లను హైలైట్ చేసి తన ఓర్వలేనితనాన్ని చాటుకుంది.ఇక్కడే అందరికీ ఒక అనుమానం పెరిగిపోయింది. అదేమిటంటే సదస్సు జరిగి రెండురోజులవుతున్నా ఇంతవరకు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అసలు నోరిప్పలేదు. మామూలుగా అయితే వీళ్ళిద్దరు ఊరికే ఉండే రకాలు కాదు. జగన్ కు వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా రెచ్చిపోతుంటారు.అలాంటి పెట్టుబడుల సదస్సుపై మాట్లాడటానికి ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. పైగా వీళ్ళు రాకుండా అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇక్కడే వీళ్ళ ఏడుపేమిటో అర్ధమైపోతోంది. సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని అంగీకరించలేరు, అలాగని ఫెయిలయ్యిందంటే జనాలు నవ్వుతారు. దాంతో ఏమి మాట్లాడలేక తమ నేతలతో మాట్లాడిస్తు, ఎల్లోమీడియాలో వ్యతిరేక వార్తలు రాయించుకుంటు ఆనందం పొందుతున్నట్లు అనిపిస్తోంది. లేకపోతే ఏమాత్రం అవకాశం దొరికినా జగన్ను ఫుట్ బాల్ ఆడుకునేందుకు దొరికిన అవకాశాన్ని వదులుకుంటారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: