రాయలసీమ : నెటిజన్లు ఫుల్లుగా వాయించేస్తున్నారుగా

Vijaya




పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఫుల్లుగా వాయించేస్తున్నారు. ఒక విధంగా లోకేష్ ది సేమ్ సైడ్ గోల్లాగ తయారైంది వ్యవహారం. ఇంతకీ విషయం ఏమిటంటే పాదయాత్రలో భాగంగా చంద్రగిరి మండలంలో లోకేష్ వెళుతున్నపుడు ఒక స్కూల్ కనబడింది. అదేమిటంటే ఒక పే...ద్ద కార్పొరేట్ స్కూల్. దాని ముందు నిలబడి లోకేష్ సెల్ఫీ తీసుకుని దాన్ని ట్విట్టర్లో పోస్టుచేశారు.



అందులో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కు చంద్రబాబునాయుడు ఎంతటి ప్రయారిటి ఇచ్చారో చెప్పారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం చంద్రబాబు పై స్కూల్ కు 8 ఎకరాల స్ధలం ఇచ్చారని గొప్పగా చెప్పుకున్నారు. దాంతో నెటిజన్లు లోకేష్ ను గట్టిగా తగులుకుంటున్నారు. ఒక కార్పొరేట్ స్కూల్ కు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వటం కూడా గొప్పేనా అని నిలదీశారు. ఆ స్కూల్లో ఫీజులే ఏడాదికి లక్షల్లో ఉంటుంది తెలుసా అంటు ప్రశ్నించారు. ఎల్కేజీ విద్యార్ధికే ఏడాది ఫీజు రు. 1.5 లక్షట.



కార్పొరేట్ ఇంగ్లీషుమీడియం స్కూళ్ళకి ప్రభుత్వ భూములిచ్చిన చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెడితే వ్యతిరేకించటమే కాకుండా కోర్టుకు  ఎందుకు వెళ్ళారంటు తలంటుపోశారు. పార్టీ పేరును తెలుగుదేశంపార్టీ అని కాకుండా ఇంగ్లీషు దేశంపార్టీ అని మార్చుకోమని ఒక నెటిజన్ సూచించారు. పనిలోపనిగా జగన్ పైన లోకేష్ బురద చల్లేశారు. ఇలాంటి క్వాలిటి ఎడ్యుకేషన్ను జగన్ కలలో కూడా అందించలేడన్నారు.



ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవే కొందరు పిల్లలు అద్భుతంగా ఇంగ్లీషు మాట్లాడుతున్న విషయం లోకేష్ కు తెలీదేమో. విద్యార్ధుల్లో ఇంగ్లీషు భాషపై పట్టుకోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్న విషయం లోకేష్ దృష్టికి రాలేదేమో అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.  ప్రభుత్వ స్కూళ్ళని నాశనంచేసిన చంద్రబాబు ప్రైవేటు స్కూళ్ళకు దోచిపెట్టడమే తెలుసంటు మరో నెటిజన్ విరుచుకుపడ్డారు. ప్రైవేటు స్కూళ్ళ ముందు సెల్ఫీలు తీసుకోవటం కాదు ప్రభుత్వ స్కూళ్ళముందు సెల్ఫీలు తీసుకుని పోస్టు చేయాలి మాలోకం అంటు కొందరు ఎగతాళి చేస్తున్నారు. మొత్తానికి అనవసరమైన విషయాన్ని కెలికి నెటిజన్లతో తలంటు పోయించుకుంటున్నాడు లోకేష్.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: