అమరావతి : కష్టానికి ఫలితం దక్కుతుందా ?

Vijaya


రాాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేయటమే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికి కర్టన్ రైజర్ గా ఈనెల మొదట్లో ఢిల్లీలో జరిగిన సదస్సులో జగన్ పాల్గొన్నారు. ఇది కాకుండా ఫైనాన్స్ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలను వ్యక్తిగతంగా కలుసుకున్నారు.



మార్చిలో జరగబోయే పెట్టుబడుల సదస్సులో పాల్గొనాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని రిక్వెస్టు చేశారు. దీనికి అదనంగా అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో పేరున్న   పారిశ్రామికవేత్తలకు జగన్ తరపున పేరుపేరున ఆహ్వానాలను పంపారు. ప్రభుత్వం తరపున ఆహ్వానాలు అందుకున్న పారిశ్రామికవేత్తల్లో అత్యధికులు సదస్సుకు హాజరయ్యేందుకు సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.



ప్రభుత్వం లెక్కల ప్రకారం గడచిన నాలుగుళ్ళల్లో రు. 76 వేల కోట్ల విలువైన పెట్టుబడులొచ్చాయి. ఇందులో ఉత్పాదకత, ఐటి, లాజిస్టిక్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. కొన్ని పరిశ్రమలు, ఐటి కంపెనీలు మొదలయ్యాయి. కొన్ని పరిశ్రమలు భూమిపూజ చేసుకుని నిర్మాణాలు మొదలుపెట్టాయి. మరికొన్ని పరిశ్రమల నిర్మాణానికి భూమిపూజ జరిగి పనులు మొదలయ్యాయి. ఇంకొన్ని పరిశ్రమలు అనుమతులు సాధించి భూమిపూజకు సిద్ధమవుతున్నాయి. సుదీర్ఘమైన సాగర తీరం, సహజవనరులు ఉండటం, రియల్ ఎస్టేట్ రంగంలో అపార అవకాశాలు, లాజిస్టిక్స్ కంపెనీల ఏర్పాటు అవసరాలు స్పష్టంగా కనబడుతున్నాయి.



ఇక్కడ గమనించాల్సిందేమంటే చంద్రబాబునాయుడు హయాంలో పెట్టుబడుల సాధనే టార్గెట్ గా దాదాపు 18 దేశాల్లో పర్యటించారు. కానీ ఏ దేశం నుండీ పెట్టుబడులు వచ్చినట్లు లేదు. చివరకు చేసిన పర్యటనల ఖర్చులు మాత్రం తడిసి మోపడైంది. అలాగే ఐదేళ్ళపాటు విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు నిర్వహణకు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి కానీ వచ్చిన పెట్టుబడి ఏమీలేదు. కానీ జగన్ మాత్రం విదేశాల్లో తిరగకుండా దేశీయ, విదేశీ కంపెనీల దిగ్గజనాలను రాష్ట్రంలో ఉండే కాంటాక్టు చేస్తున్నారు. మరి ప్రభుత్వ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందో రాదో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: