గోదావరి : జగన్ ఇక్కడ తప్పుచేశారా ?

Vijaya

తాజాగా ఎంపికచేసిన 18 మంది ఎంఎల్సీ అభ్యర్ధుల విషయంలో ఒకచోట జగన్మోహన్ రెడ్డి తప్పుచేశారని పార్టీలోనే చర్చ జరుగుతోంది. మొత్తం అభ్యర్ధుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటంలో తప్పులేదు. అయితే ఎంపికచేసిన నేతలకు సంబంధించి ఒకరిద్దరి విషయంలో పార్టీలో అసంతృప్తి కనబడుతోంది. విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన తొమ్మిది స్ధానాల్లో కౌరు శ్రీనివాస్ కూడా ఒకరు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కౌరు శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన నేత.



ఇదే సామాజికవర్గంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు చెందిన కుడిపూడి సూర్యనారాయణను ఎంపికచేశారు. కాబట్టి కౌరు స్ధానంలో బీసీల్లోని మరో ఉపకులానికి చెందిన నేతను ఎంపిక చేసుంటే బాగుండేదనే చర్చ పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కౌరు శ్రీనివాస్ ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ గా ఉన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ అంటే చిన్న పదవేమీ కాదు. ఇప్పటికే క్యాబినెట్ ర్యాంకులో ఉన్న కౌరునే మళ్ళీ ఎంఎల్సీగా ఎంపిక చేసేబదులు మరో నేతను ఎంపికచేసుంటే బాగుండేదని పార్టీలోనే టాక్ నడుస్తోంది.



ఇపుడు సమస్య ఏమి వచ్చిందంటే జిల్లా పరిషత్ ఛైర్మన్నే ఎంఎల్సీగా ఎంపిక చేయటం ఒకటి. అలాగే రేపు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కొత్త నేతను ఎంపిక చేయాల్సిరావటం మరోటి. ఎంఎల్సీ అభ్యర్ధిగా ఎంపికయ్యారు కాబట్టి నామినేషన్ సమయానికే జిల్లా పరిషత్ ఛైర్మన్ గా రాజీనామా చేస్తారు. అప్పుడు ఛైర్మన్ గా కొత్తనేతను ఎంపిక చేయాల్సుంటుంది. ఛైర్మన్ పదవికోసం మళ్ళీ పార్టీలోని నేతలు పోటీపడతారు.




అప్పుడు ఎవరో ఒకరికే అవకాశం దక్కుతుంది. దాంతో మిగిలిన వాళ్ళలో అసంతృప్తి మొదలవుతుంది. ఇప్పటికే పదవిలో ఉన్న వ్యక్తికే మరో పదవిని కట్టబెట్టి కొత్త తలనొప్పులు తెచ్చుకునే బదులు ఎంఎల్సీ అభ్యర్ధిగానే మరో నేతకు అవకాశం ఇచ్చుండచ్చనేది పార్టీ నేతల భావన. ఏదేమైనా 18 మంది నేతల ఎంపికలో పార్టీలో ఈ ఒక్క ఎంపికపైనే చర్చలు జరుగుతున్నాయంటే జగన్ తప్పుచేశారనే అనిపిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: