చిన్నారి మృతికి GHMC పై హైకోర్టు ఫైర్?

Purushottham Vinay
ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువైంది. వాటి వల్ల చాలా మంది పిల్లలు దారుణంగా చనిపోతున్నారు.అధికారులు కూడా పట్టి పట్టనట్టు వుంటున్నారు.ఇక హైదరాబాద్ అంబర్‌పేటలో మూడు రోజుల క్రితం నాలుగేళ్ల ప్రదీప్‌పై వీధి కుక్కలు చాలా దారుణంగా దాడి చేసి చంపాయి. ఆ బాలుడి మరణంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రాన్నే షేక్ చేసింది.అంబర్‌పేట వీధి కుక్కల దాడిని సుమోటోగా తీసుకున్న హైకోర్టు కేసును మార్చి 16 వ  తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్ అంబర్‌పేటలో మూడు రోజుల క్రితం నాలుగేళ్ల ప్రదీప్‌పై వీధి కుక్కలు చాలా దారుణంగా దాడి చేయగా..ఇక ఆ బాలుడు చాలా దారుణంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. వీధి కుక్కల దాడిలో పాపం ఆ బాలుడు దారుణంగా మరణించడంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం రేపింది. ఈ దారుణమైన ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీధి కుక్కల నియంత్రణకు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకునేందుకు కావలసిన ప్లాన్ లు చేస్తోంది.

ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు వీధి కుక్కల దాడి కేసును ఒక సుమోటోగా స్వీకరించి ఈ రోజు(ఫిబ్రవరి 23) విచారణ కూడా జరిపింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని విచారణ సమయంలో హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఇంకా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆ బాలుడు చనిపోయాడన్న హైకోర్టు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ఇంకా అలాగే అధికారులను ప్రశ్నించింది.ఇంకా అలాగే ఈ విషయంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ, GHMC, హైదరాబాద్ కలెక్టర్ ఇంకా తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ అలాగే అంబర్ పేట్ అధికారులకు నోటీసులు కూడా జారీ చేసింది తెలంగాణ హై కోర్టు. ఇంకా నష్ట పరిహారం చెల్లింపు అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను చాలా సీరియస్ గా ఆదేశించింది.ఇంకా అలాగే తదుపరి విచారణను మార్చ్ 16వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: