అమరావతి : వైసీపీ దెబ్బకు ఈనాడుకు దిమ్మతిరిగిపోయిందా ?

Vijayaవైసీపీ సోషల్ మీడియా దెబ్బకు ‘ఈనాడు’కు దిమ్మతిరిగిపోయింది. తెలుగుదేశంపార్టీ నేత పట్టాభిరామ్ ను పోలీసులు చచ్చేట్లు కొట్టారంటు చంద్రబాబునాయుడు అండ్ కో గోల గోల చేస్తున్నారు. వీళ్ళు ఇంతగా ఎందుకు గోలచేశారంటే ఈనాడు దినపత్రికలో అచ్చయిన బ్యానర్ కథనమే కారణం. అంటే చంద్రబాబు-ఈనాడు కూలబక్కునే ఈ కంపంతా చేశారులేండి. విషయం ఏమిటంటే బ్యానర్ కథనంలో ‘పట్టాభినీ కొట్టారు’ అని పెద్ద అక్షరాలతో బ్యానర్ స్టోరీ రాసింది.స్టోరీ వరకు రాసి ఊరుకునుంటే సరిపోయేది. కానీ అలాగ ఊరుకుంటే అది ఈనాడు ఎందుకవుతుంది ? అందుకనే స్టోరీతో పాటు నాలుగు ఫొటోలను కూడా అచ్చేసింది. ఈనాడు బ్యానర్ స్టోరీ, ఫొటోలను పట్టుకుని పట్టాభి తరపు న్యాయవాదులు కోర్టులో చాలా బలంగా వాదించారు. అయితే ఉదయం 10 గంటల నుండి ఈనాడుకు వాయింపుడు మొదలైంది. కారణం ఏమిటంటే ఈనాడులో ప్రింటైన ఫొటోలు ఎప్పుడో రెండేళ్ళక్రిదంటివి. వైసీపీ సోషల్ మీడియా ఈనాడును చీల్చి చెండాడేసింది.2021లో ఫొటోలను పట్టుకుని ఇపుడు పోలీసులు కొట్టినట్లుగా స్టోరీ రాసేసింది. దాంతో ఈనాడులో వచ్చిన స్టోరీ, ఫొటోలన్నీ పూర్తి తప్పుడువే అని వైసీపీ సోషల్ మీడియా ఆధారాలతో సహా దుమ్ముదులిపేసింది. ఇదే సమయంలో పట్టాభికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తమ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. అందులో పట్టాభికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టంగా నిర్ధారించారు. దాంతో ఈనాడు, చంద్రబాబు అండ్ కో కు ఏమిచేయాలో దిక్కుతోచలేదు.ఇక లాభంలేదని అర్ధమైపోయి వెంటనే ఈనాడు యాజమాన్యం చెంపలేసుకుంటు ఒక వివరణ ప్రకటించింది. పట్టాభిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని ప్రచురించిన ఫొటోల్లో పారబాటు జరిగిందని క్షమాపణ చెప్పుకున్నంత పనిచేసింది. పాత ఫొటోలను ఉపయోగించినట్లు అంగీకరించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లోమీడియా ఏ స్ధాయిలో తప్పుడు వార్తలు రాస్తోందో, బురదచల్లుతోందో అందరికీ సాక్ష్యాధారాలతో సహా అర్ధమైపోయింది. ఇదే సమయంలో ఎల్లోమీడియాకు వైసీపీ సోషల్ మీడియా పవర్ ఏమిటో కూడా బాగా అర్ధమైపోయినట్లుంది. అందుకనే ఇకనుండైనా జాగ్రత్తగా ఉంటే ఎల్లోమీడియాకే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: