అమరావతి : లోకేష్ పాదయాత్ర మీద చంద్రబాబు దెబ్బపడిందా ?

Vijaya
చాలా రోజుల గ్యాప్ తర్వాత చంద్రబాబునాయుడు జనాల్లోకి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. జగ్గంపేటలో జరిగిన రోడ్డుషోకు జనాలు బాగానే వచ్చారు. ఇది పార్టీ మ్యానేజ్మెంటే అనుకున్నా దీన్నికూడా బాగానే మ్యానేజ్ చేశారనే అనుకోవాలి. పార్టీజనాలు కొంత మామూలు జనాలు మరికొంత కలిసి రోడ్డుషోలో జనాలు బాగానే హాజరైనట్లు కనబడుతోంది. జనాలు ఎక్కువగా హాజరైనట్లు ఇరుకు రోడ్లలో సభలు పెట్టారా, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారా లేకపోతే ద్రోన్లతో కావాలనే క్లోజ్ షాట్లు తీశారా అన్నది వేరే సంగతి. చంద్రబాబు రోడ్డుమీదకు వస్తే స్వచ్చంధంగా వచ్చే జనాలున్నారు.సీన్ కట్ చేస్తే కొడుకు లోకేష్ పాదయాత్ర యువగళం నడుస్తోంది. చిత్తూరు జిల్లాలోని నగిరి నియోజకవర్గంలో జరుగుతోంది. పాదయాత్ర మొదటిరోజు మినహాయిస్తే రెండోరోజు నుండే యాత్రలో జనాలు పెద్దగా కనబడలేదు. అక్కడక్కడ జనాలు కనిపించినా మొత్తంమీద జనాలు లేక వెలాతెలా పోతున్నదనే ప్రచారం పెరిగిపోయింది. బహిరంగసభల్లోనే జనాలు పెద్దగా హాజరుకాలేదు. కొడుకు పాదయాత్ర ఫెయిలనే ప్రచారం బాగా పెరిగిపోవటంతో జిల్లాల్లోని తమ్ముళ్ళపై చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండిపోయినట్లు స్వయంగా అచ్చెన్నాయుడే చెప్పారు.
లోకేష్ పాదయాత్ర ఎన్నిరోజులు జరిగినా నెగిటివ్ ప్రచారమైతే ఆగదంతే. కాకపోతే పాదయాత్రను నిలిపేస్తే పరువుపోతుంది కాబట్టి మొక్కుబడిగా కంటిన్యు చేయాలంతే. లేకపోతే ఏదోసాకు చెప్పుకుని లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి పాదయాత్రను నిలపాలంతే. ఇక్కడే 73 ఏళ్ళ చంద్రబాబు రోడ్డుషో  40 ఏళ్ళ లోకేష్ పాదయాత్రను దెబ్బకొట్టింది.  సమస్య ఏమిటంటే లోకేష్ కు మాట్లాడటం చేతకాదు. చంద్రబాబు కొడుకు హోదాలో నెట్టుకొచ్చేస్తున్నారంతే. మాట ముద్దగా వస్తున్న కారణంగా ఏమి మాట్లాడుతున్నది చాలాసార్లు అర్ధంకాదు.సబ్జెక్టు నాలెడ్జీ కూడా లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎలాగూ నాయకత్వ లక్షణాలు లేవు, వాగ్ధాటి కూడా లేదు కాబట్టి జనాలను ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతోనే పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అనే ముద్రపడిపోయింది. చంద్రబాబు కూడా మాటకారేమీ కాదు. కానీ మ్యానేజ్మెంట్ స్కిల్స్ చాలా ఉన్నాయి. ఒకవైపు చంద్రబాబు రోడ్డుషోలు మరోవైపు  లోకేష్ పాదయాత్ర  ఏకకాలంలో జరుగుతుండటంతో పాదయాత్ర ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: