వైసీపీ ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటి ?

VAMSI
ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 2024 లో జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీ మార్పు చెందుతుందన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా అధికార పార్టీపై ప్రతిపక్షము విసురుతున్న ప్రధాన విమర్శలలో పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకపోవడం , రాష్ట్రంలోకి విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రాకపోవడం, ఇక ఇవి కాకుండా రోడ్లు మరియు ఉద్యోగాల సమస్య లాంటి మరికొన్ని అంశాలను ప్రతిపక్షాలు ప్రజల ముందుకు తీసుకువెళ్లి వైసీపీని బలహీనపరుస్తున్నారు.
ఇప్పుడు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ పాదయాత్రను టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పైన తెలిపిన కారణాలను వాడుకోవాలని చూస్తోంది. కాగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జగన్ అంత సులభంగా అధికారాన్ని కోల్పోతాడు అన్నది కూడా ఊహించలేము. గతంలో ఎలా అయితే పాదయాత్ర చేసి అతి తక్కువ వయసులో రాష్ట్ర సీఎంగా అవతరించాడో ? మళ్ళీ అటువంటి ఒక ఆలోచనతో ప్రజల ముందుకు వెళ్లి మెప్పించే ప్రయత్నం చేస్తాడని చెప్పాలి.
ఒకవేళ 2024 ఎన్నికల్లో ఏమాత్రం అటూ ఇటు అయి ప్రత్యర్థుల చేతిలో వైసీపీ ఓడిపోతే జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదే జరిగితే... మళ్ళీ జగన్ కు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అస్సలు జగన్ అధికారం లేకుండా సీఎం అన్న హోదా లేకుండా ఉండడం అంటే నరకమే అని చెప్పాలి. మరి ఏమి జరగనుంది ? రాజకీయ నాయకుల భవిష్యత్తును తేల్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి అన్నది చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: