చెన్నై : నిజమైన సంచలన వార్త..ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికేఉన్నాడా ?

Vijaya



సోషల్ మీడియాతో పాటు చాలా చోట్ల సంచలమైన వార్తని, సంచలనమైన వ్యాఖ్యలని తరచూ చూస్తునే ఉంటాం. అలా వచ్చే వాటిల్లో నిజంగానే సంచలనమైనవి ఎన్నుంటాయో ఎవరికీ తెలీదు. కానీ తాజాగా చక్కర్లు కొడుతున్న ఒక వార్త నిజమైతే మాత్రం దీనికి మించిన సంచలనం మరోటుండదని బల్లగుద్ది చెప్పచ్చు. ఇంతకీ నిజంగానే సంచలనం అనంటున్న విషయం ఏమిటంటే ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్ళై ప్రభాకరన్ తొందరలోనే ప్రజల ముందుకు వస్తారట.



ఈ విషయం చెప్పిందెవరంటే ఎల్టీటీఈ స్ట్రాంగ్ సపోర్టర్ నెడుమారన్ అనే వ్యక్తి.  89 ఏళ్ళ నెడుమారన్ ఒకపుడు కాంగ్రెస్ లో ప్రముఖ నేతనే చెప్పాలి. కానీ పార్టీకి దూరమైపోయి చాలా సంవత్సరాలవుతోంది. అలాగే చాలాకాలంగా ఎల్టీటీఈని బలోపేతం చేయటం కోసమే పనిచేస్తున్నారు. లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం తరపున ప్రపంచ వ్యాప్తంగా నిధులు సేకరించటం, టెక్నాలజీని అప్ డేట్ చేసుకోవటానికి అవసరమైన సాంకేతిక నిపుణులను సమకూర్చటం, సానుభూతిపరులు, మద్దతుదారులను కూడగట్టడంలో నెడుమారన్ బిజీగా ఉన్నారు.



అలాంటి నెడుమారన్ తంజావూరులో మీడియాతో మాట్లాడుతు తొందరలోనే తనను నమ్ముకున్న ప్రజల కోసం వేలుపిళ్ళై ప్రభాకరన్ వస్తారని పెద్ద బాంబే పేల్చారు. ఈయన ప్రకటనతో దేశంలో పెద్ద సంచలనమే అవుతోంది. కారణం ఏమిటంటే టార్గెట్లను చంపటానికి  సూసైడ్ బాంబర్ అనే విధానం ఒకటుందని యావత్ ప్రపంచానికి తెలిసింది ఎల్టీటీఈ ద్వారానే. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధిని సూసైడ్ బాంబుతో హతమార్చటం ప్రపంచంలోనే పెద్ద సంచలనమైంది.



సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఎల్టీటీఈ దళాలను శ్రీలంక ఏరిపారేసింది. కొన్ని వేలమంది ఎల్టీటీఈ సైన్యంతో పాటు సానుభూతి, మద్దతుదారులను కూడా హతమార్చేసింది. 2009లో అండర్ గ్రౌండ్లో దాక్కున్న ప్రభాకర్ ను వేటాడి మరీ చంపేసినట్లు శ్రీలంక ప్రభుత్వం కొన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. అప్పుడెప్పుడో చనిపోయాడని అనుకుంటున్న ప్రభాకర్ తొందరలోనే జనాల్లోకి వస్తాడని నెడుమారన్ చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. నిజంగానే ప్రభాకర్ చనిపోయుంటే ప్రభాకర్ బతికే ఉన్నాడని ఇపుడు నెడుమారన్ చెప్పటం ఏమిటి ? బతికుండటమే నిజమైతే అప్పట్లో శ్రీలంక సైన్యం చంపిందెవరిని ? ఆ ఫొటోలు ఎవరివి ? అన్నదే ఇపుడు సంచలనమైంది.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: