అమరావతి : పవన్ డిసైడ్ అయిపోయారా ?

Vijaya



నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ఒక టాక్ షో లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెస్టుగా పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్ తొందరలోనే రిలీజ్ అవబోతోంది. దానికి సంబంధించిన కొన్ని ప్రొమోలు రిలీజ్ చేశారు. అలాంటి వాటిల్లో ఒక ప్రోమోలో బాలయ్య ఓ ప్రశ్నవేశారు. ఆ ప్రశ్న ఏమిటంటే ‘ఇంతమంది అశేష అభిమానులున్నప్పటికీ వాళ్ళంతా ఎందుకు ఓట్లేయటంలేదు’ ? అని. దానికి పవన్ సమాధానం ఏమిటంటే ‘నా ఫ్యాన్స్ అంతా నాకు ఓట్లేయరు’ అనిచెప్పారు.



ఇంతకాలానికి పవన్ కు ఈ విషయంలో క్లారిటి వచ్చినట్లుంది. అభిమానం వేరు అది ఓట్లరూపంలోకి మారటం వేరని పవన్ సమాధానమిచ్చారు. నిజానికి ఈ విషయం తెలుసుకోవటానికి పవన్ కు ఇంతకాలం పట్టాల్సిన అవసరంలేదు. ఎందుకంటే తన అన్న, మెగాస్టార్ చిరంజీవి విషయంలో జరిగింది గమనించుంటే అభిమానులందరు ఓటర్లు కారన్న సత్యం ఎప్పుడో బోధపడుండేది. తన అభిమానులంతా తనకు కచ్చితంగా ఓట్లేస్తారని చిరంజీవి లాగ అనుకునే పార్టీపెట్టి బోల్తాపడ్డారు.



అభిమానం ఓట్లరూపంలో మారాలంటే సంవత్సరాలపాటు కష్టపడాలని పవన్ చెప్పారు. జనాల్లో తనమీద నమ్మకం తెచ్చుకోవటానికి చాలా సంవత్సరాలు పడుతుందని అప్పుడే అభిమానం ఓట్లరూపంలోకి మారుతుందని పవన్ కు అర్ధమైంది. అభిమానం ఓట్లరూపంలో మారటానికి తక్కువలో తక్కువ దశాబ్దమన్నర పడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి తాను నమ్మకం సంపాదించుకునే పనిలోనే ఉన్నట్లు చెప్పారు.




పవన్ తాజా మాటలు చూస్తే ఆ దశాబ్దమన్నర ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. అభిమానులే పవన్ కు ఓట్లేయకపోతే ఇక మామూలు జనాలు ఎందుకు ఓట్లేస్తారు ? పవన్ పైన అభిమానుల్లోనే నమ్మకం కలగనపుడు మామూలు జనాలు ఎలా నమ్ముతారు ? అంటే తనను జనాలు నమ్మటంలేదని, ఓట్లేయరని తెలిసీ వచ్చేఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిపోదామని పవన్ ఎలా అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. పవన్ మీద జనాల్లో నమ్మకం పెరిగేసరికి పుణ్యకాలం గడచిపోతుందేమో. అప్పటివరకు చంద్రబాబునాయుడు పల్లకి మోయటానికే పవన్ రెడీ అయినట్లున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: