రాయలసీమ : జగన్ కు లోకేష్ వార్నింగా ?

Vijaya


నారా లోకేష్ పాదయాత్ర యువగళంలో చాలా పెద్ద మాటలు మాట్లాడారు. చిత్తూరు యువగళం  పాదయాత్ర  సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డికి భయమంటే ఏమిటో రుచి చూపిస్తానని ప్రతిజ్ఞచేశారు. 2024 ఎన్నికల తర్వాత జగన్ తన ఇంట్లోనుండి అడుగు ఎలా బయటపెడతారో చూస్తానని చాలెంజ్ చేశారు. జగన్ కు అసలైన భయాన్ని పరిచయం చేసే బాధ్యత నాది అని నేతలు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఇపుడు తమ నేతల విషయంలో ప్రభుత్వం ఎలా అమానుషంగా వ్యవహరిస్తోందో టీడీపీ ప్రభుత్వం రాగానే ఇంతకుమించి చర్యలుంటాయని చెప్పారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ కు భయమంటే ఏమిటో లోకేష్ రుచిచూపించటం ఏమిటో అర్ధంకావటంలేదు. 2019 ఎన్నికల తర్వాత ఎవరు ఎవరికి భయపడుతున్నారో జనాలందరు చూస్తున్నదే. గడచిన 30 ఏళ్ళల్లో చంద్రబాబునాయుడు  ఏడాదికి ఒకసారికన్నా కుప్పంకు వెళ్ళిందిలేదు. అలాంటిది స్ధానికసంస్ధల ఎన్నికల తర్వాత రెగ్యులర్ గా ప్రతినెలా మూడురోజులు చంద్రబాబు ఎందుకని కుప్పంలో పర్యటిస్తున్నారు ? వచ్చేఎన్నికల్లో గెలుపు కష్టమన్న  భయంతోనే కదా.




వచ్చేఎన్నికల్లో జగన్ను ఎలాగైనా  ఓడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పరితపిస్తున్నదెవరు ? చంద్రబాబే కదా. జగన్ అంటే భయంవల్లే కదా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నది. పొత్తుల్లేందే ఎన్నికల్లో పోటీచేయలేనని చెప్పిన చంద్రబాబు, గెలిచినా ఓడినా ఒంటరిగానే పోటీచేస్తామని చెప్పిన జగన్ ఇద్దరిలో భయస్తుడెవరు ?



జగన్ కు భయాన్ని పరిచయం చేయటం తర్వాత ముందు తన తండ్రిలోని భయాన్ని పోగొట్టి ఒంటరిపోటీకి లోకేష్ రెడీచేస్తే అదే చాలా పెద్ద విషయం. మొత్తానికి పిట్టకొంచెం కూత ఘనమన్నట్లుగా ఉంది లోకేష్ ప్రతిజ్ఞ. యువగళంలో లోకేష్ మాట్లాడుతున్నది తమ్ముళ్ళకే అర్ధంకావటంలేదు. పట్టుమని నాలుగు మాటలు కూడా తప్పుల్లేకుండా మాట్లాడలేకపోతున్న లోకేష్ కూడా జగన్ కు భయాన్ని పరిచయం చేస్తానని చెప్పటమే విచిత్రంగా ఉంది. చూడబోతే మావయ్య కమ్ మామగారి సినిమా డైలాగులను బాగా బట్టీపట్టినట్లున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: