అమరావతి : లోకేష్ కు జేసీ షాకిచ్చారా ?

Vijaya




అసలే పాదయాత్ర యువగళంతో నారా లోకేష్ నానా అవస్ధలు పడుతున్నారు. అసలు పాదయాత్రను ఎందుకు పెట్టుకున్నానా అని పదేపదే అనుకుంటున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి కొత్తగా ఏమీలేవు. పోనీ తాము అధికారంలోకి వస్తే ఏమిచేస్తామో చెప్పటానికీ ఏమీలేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసిన ఘనచరిత్ర చంద్రబాబునాయుడు సొంతం. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ కు కూడా పాత్రుంది.



ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారన్న మంటతోనే జనాలు 2019 ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు. చంద్రబాబు పరిపాలనను జనాలు ఇంకా మరచిపోలేదు. అలాంటపుడు లోకేష్ కొత్తగా ఇపుడు ఇఛ్చే హామీలను ఎవరైనా నమ్ముతారా ? అందుకనే లోకేష్ పాదయాత్రంటే జనాల్లో పెద్దగా రెస్పాన్స్ ఉండటంలేదు. ఈ కారణంగానే పాదయాత్రలో కానీ సభల్లో కానీ జనాలు పెద్దగా కనిపించటంలేదు. చిత్తూరు సభలో జనంలేని విషయమై చంద్రబాబు నేతలందరికీ ఫుల్లుగా క్లాసుపీకినట్లు ప్రచారం జరుగుతోంది.



సరిగ్గా ఈ సమయంలోనే సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి మాట్లాడుతు లోకేష్ పాదయాత్ర వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు. లోకేష్ పాదయాత్ర చేసినంతమాత్రానా పార్టీకి ఏమీ ఉపయోగం ఉండదని స్పష్టంగా ప్రకటించారు. అంటే జేసీ లెక్కప్రకారం లోకేష్ పాదయాత్ర శుద్ధవేస్టు వ్యవహారమని అర్ధమైపోయింది.



చంద్రబాబు, లోకేష్ ఏమో పాదయాత్రతో నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తటం ఖాయమని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయటం ఖాయమని కలలుగంటున్నారు. మరదే పార్టీ నేత జేసీ ఏమో పాదయాత్రను జనాలు ఎవరూ సీరియస్ గా తీసుకోరని చెప్పేశారు. లోకేష్ పాదయాత్రే కాదు తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా వేస్టే అని తేల్చేశారు. ఎవరు పాదయాత్రలు చేసినా జనాలు నమ్మటంలేదని, పట్టించుకోవటంలేదన్నారు. తన పాదయాత్రపై సొంతపార్టీ నేత జేసీ చేసిన కామెంట్లు లోకేష్ కు షాకింగ్ అనే చెప్పాలి. మరీ కామెంట్లపై చంద్రబాబు, లోకేష్ ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: