కొడాలి నానిపై మాజీ మహిళా కేంద్ర మంత్రి పోటీ... సెన్సేషన్ అవుతుందా ?

VAMSI
రాజకీయాలు అన్నాక ఒక పార్టీపై మరొక పార్టీ నాయకులు విమర్శలు చేయడం సహజంగానే జరుగుతున్న విషయం. అయితే ఇలా విమర్శలు చేయడం పట్ల నాయకులు వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడడం... దాని వలన వివాదాలు జరగడం కూడా చేస్తూనే ఉన్నాము. ఇటీవల ఇలాంటి ఒక సంఘటన తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఉంటున్న రేణుక చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీ పాలన మరియు అధికార పార్టీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈమె మాట్లాడుతూ జగన్ పాలన ఏ మాత్రం సరిగా లేదని... వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించింది.
ఈ వ్యాఖ్యలు విన్న గుడివాడ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి కొడాలి నాని ఆమెపై విమర్శలు చేశారు. కొడాలి నాని రేణుక చౌదరిని ఉద్దేశించి కార్పొరేటర్ గా కూడా గెలవలేదు... మా నాయకుడు జగన్ పాలన గురించి మాట్లాడుతున్నారంటూ రెచ్చిపోయారు. రేణుక చౌదరి కొడాలి నాని మాటలకు నేను కార్పొరేటర్ గా ఉన్న సమయంలో నాని ఒక లారీ క్లీనర్ గా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. నా రాజకీయ బలం ఏమిటో తెలియాలంటే ఖమ్మం వీధుల్లోకి వచ్చి చూడని... వచ్చే ఎన్నికల్లో ఏపీలో గుడివాడ నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా చెప్పడం రాజకీయంగా సంచలనము అయింది.
వాస్తవంగా చూసుకుంటే రేణుక చౌదరి రాజకీయమగు ఎక్కువ అనుభవం గడించిన నేత.. ఈమె టీడీపీలో 1986 నుండి 1998 వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. మరియు దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లి ఖమ్మం నుండి వరుసగా 1999 మరియు 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అదే సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేశారు. ఆ తర్వాత 2009 లో ఎంపీగా ఓటమి పాలు కాగా, 2012
లో రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇంతటి చరిత్ర ఉన్న రేణుక చౌదరి ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని పై చెప్పిన విధంగానే పోటీ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: