హైదరాబాద్ : ఏపీలో బీఆర్ఎస్ సైలెంట్ ఆపరేషన్ ?

Vijaya



రాజకీయాలకు సంబంధించి గురువారం ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే హైదరాబాద్ లో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ ప్రముఖులతో భేటీఅయ్యారు. కుత్బుల్లాపూర్ ఎంఎల్ఏ వివేకానంద గౌడ్ పై ఇద్దరితో భేటీ అయి మాట్లాడారు. తనంతట తానుగా వివేకా వీళ్ళిద్దరితో భేటీఅయ్యే అవకాశాలు లేవు. అందుకనే కేసీయార్ లేదా కవిత ఆదేశాల మేరకే వివేకా వీళ్ళతో భేటీ అయినట్లు సమాచారం.



ఇప్పటికే కేసీయార్ తో గంటా రెండుసార్లు సమావేశమయ్యారు. కానీ గంటా డిమాండ్లకు కేసీయార్ అంగీకరించలేదని సమాచారం. అందుకనే బీఆర్ఎస్ లో గంటా  చేరికపై క్లారిటి రాలేదు. అయితే తాజాగా వివేకాతో భేటీలో ఇద్దరి మధ్య ఏ అంశాలపై చర్చలు జరిగాయన్న విషయం తెలియలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆర్ధిక అంశాలతో పాటు ఏపీ పూర్తి బాధ్యతలు తనకే అప్పగించాలని కేసీయార్ ను గంటా గట్టిగా అడిగినట్లు తెలిసింది. ఈ విషయంలో విభేదించిన కారణంగానే తోట చంద్రశేఖర్ ను కేసీయార్ అధ్యక్షుడిగా ప్రకటించారట.



తోటను అధ్యక్షుడిగా నియమించేసిన తర్వాత కూడా గంటాను వివేక్ ఎందుకు కలిశారో అర్ధంకావటంలేదు. అలాగే లక్ష్మీనారాయణతో భేటీ వివరాలు కూడా తెలీలేదు.  జేడీకి గతంలో కేసీయారే స్వయంగా ఫోన్ చేసి బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు. అప్పుడు ఆలోచించుకుని చెబుతానని జేడీ చెప్పారు. మరి దానికి కంటిన్యుయేషన్ గానే జేడీతో వివేకా భేటీ అయినట్లు అనుకోవాలి.



ఏదేమైనా వివేకాతో గంటా, జేడీ భేటీకి సంబంధించిన ఫొటోలు ఇపుడు వైరల్ గా మారింది. తొందరలో విశాఖపట్నంలో జరగబోయే బీఆర్ఎస్ బహిరంగసభలోనే వీలైనంతమంది ప్రముఖుల జాయినింగ్స్ ఉంటాయని సమాచారం. అలాగే ఉత్తరాంధ్రలోని మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలతో పాటు పలువురు సీనియర్ నేతలు, వ్యాపార ప్రముఖులు, ఉద్యమనేతలు, రిటైర్డ్ ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ ప్రముఖులు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ఎంట్రి విషయంలో బీఆర్ఎస్ చాపకింద నీరులాగ ప్రయత్నాలు చేసుకుంటున్న విషయం అర్ధమవుతోంది. చివరకు ఏమవుతుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: