అమరావతి : జగన్ దగ్గర ఎవరికైనా ఒకటే ట్రీట్మెంటా ?

Vijaya



జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు ఇక్కడే బయటపడుతున్నాయి. తన దగ్గర ఎవ్వరికైనా ఒకటే ట్రీట్మెంట్. సన్నిహితులకు ఒక విధంగా కానివాళ్ళకు మరోవిధంగాను ఉండదు. కాకపోతే చర్యలు తీసుకోవటంలో కాస్త ఓపికపడతారంతే. ఒకటికి రెండుసార్లు చెబుతారు. వింటే సరి లేకపోతే వేటు వేసేయటమే. వేటుకు గురయ్యే నేత ఎంఎల్ఏ, మాజీ మంత్రి, మాజీ ఎంఎల్ఏ, సీనియర్ నేత ఎవరైనా కావచ్చు ఏమాత్రం పట్టించుకోరు. జగన్ కోరుకునేది తనకు లాయల్ గా ఉన్నారా లేదా జనాల్లో తిరుగుతున్నారా లేదా అని మాత్రమే.



పై రెండు పాయింట్లలో దేనిలో తేడా వచ్చినా ఉపేక్షించరు. ఇప్పుడిదంతా ఎందుకంటే నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలోనే. జగన్ కు ఈ ఎంఎల్ఏ చాలా సన్నిహితుడని అందరికీ తెలిసిందే. అయితే కోటంరెడ్డి వైఖరిలో తేడా వచ్చేసింది. మంత్రి పదవి ఇవ్వలేదని కావచ్చు, లేదా తాను ఆశించిన పదవుల్లో ఏదీ దక్కలేదనీ కావచ్చు. మొత్తానికి ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. బుజ్జగించినా వైఖరిలో మార్పురాకపోగా మరింత రెచ్చిపోతున్నారు.




అందుకనే నియోజకవర్గానికి వేరే నేతను ఇన్చార్జిగా పెట్టేందుకు జగన్ రెడీ అయిపోయారు. ఇలాంటి వ్యవహారమే వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి విషయంలో కూడా జరిగింది. ఎంతచెప్పినా వినకుండా కావాలనే ప్రభుత్వంపై బురదచల్లేస్తుండటంతో ఇన్చార్జిగా నేదురమల్లి రామకుమార్ రెడ్డిని నియమించారు.




తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్న కారణంగానే కత్తెర సురేష్ ను ఇన్చార్జిగా నియమించారు. నరసాపురంలో సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బరాయుడు, గుంటూరులో రావి వెంకటరమణలు ఓవర్ చేస్తున్నారనే సస్పెండ్ చేశారు. మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు లాంటి మరికొందరి  విషయంలో కూడా జగన్ సీరియస్ అయ్యే అవకాశముంది. పార్టీకి నష్టం జరుగుతోంది అని అనుకుంటే ఎవరైనా సరే యాక్షన్ తీసుకోవటంలో వెనకాడటమే లేదు. పార్టీలో క్రమశిక్షణ రావాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవంతే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: