పవన్ మూవీకి గాడ్ ఫాదర్ గా మారుతున్న అల్లు అరవింద్ !

Seetha Sailaja

చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పరాజయం తరువాత కొన్ని విషయాల పై పవన్ కు అల్లు అరవింద్ కు మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అంటూ అప్పట్లో ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి కొనసాగింది. ఆతరువాత అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ లు పెద్దగా సన్నిహితంగా కలిసి ఉన్న సందర్భాలకు సంబంధించిన ఫోటోలు కానీ వార్తలు కానీ రాలేదు. ఆతరువాత అల్లు అర్జున్ పవన్ విషయమై అతడి అభిమానుల దగ్గర ‘చెప్పన్ బ్రదర్’ అంటూ చేసిన కామెంట్స్ వల్ల పవన్ కు అల్లు కాంపౌండ్ కు ఏర్పడిన ఆగ్యాప్ అలాగే కొనసాగుతోంది అంటూ అనేక ఊహాగానాలు వచ్చాయి.

అయితే ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ‘ఆహా’ లో హోస్ట్ చేస్తున్న షోకు అతడిని తీసుకు రావడానికి అరవింద్ పవన్ తో నడిపించిన రాయబారాలు సఫలం కావడంతో పవన్ ఆహా షోకు రావడమే కాకుండా తన షో వల్ల ఆహా కు మంచి రేటింగ్స్ రావడానికి పరోక్షంగా సహకరించిన విషయం తెలిసిందే. ఈషో ఇంకా ఆహా లో స్ట్రీమ్ కాకుండానే పవన్ సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య తీస్తున్న భారీ మూవీకి సీక్రెట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది.

ఈ గాసిప్పులకు మరింత బలం చేకూరుస్తు పవన్ సుజిత్ దర్శకత్వంలో మొదలుపెట్టిన మూవీ ప్రారంభోత్సవానికి అరవింద్ రావడమే కాకుండా ఆ ప్రారంభోత్సవ ఫంక్షన్ కు వచ్చిన అందరు అతిధులతో అరవింద్ సాన్నిహిత్యంగా తిరగడం చూసినవారు ఈమూవీకి నిర్మాత డివివి దానయ్య అని అనుకోవాలా లేదంటే అరవింద్ అని అనుకోవాలా అంటూ కొందరు గుసగుసలు ఆడుకున్నట్లు టాక్.

పవన్ ప్రస్తుతం రాజకీయాలలో చాల బిజీగా ఉంటూ ఉండటంతో తాను నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ను ఇంకా పూర్తి చేయలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రారంభోత్సవం జరుపుకున్న సుజిత్ సినిమాను పవన్ ఎప్పటికి పూర్తి చేస్తాడు అంటూ కొందరు కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: