అమరావతి : జగన్ దెబ్బకు జనసేనకు మతిపోయిందా ?

Vijayaజగన్మోహన్ రెడ్డి కొడుతున్న దెబ్బకు జనసేనకు నిజంగానే మతిపోయినట్లుంది. అందుకనే పసలేని ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నది. నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ పై శతఘ్ని పేరుతో జగన్ పై ఒక కామెంట్ పోస్టయ్యింది. అదేమిటంటే ‘సొంత పుత్రుడిపై నమ్మకంలేక కన్నతల్లే పక్క రాష్ట్రం పారిపోయింది...కన్నతల్లి కూడా నమ్మలేని కొడుకుని ప్రజలెలా నమ్ముతారు’ అనుంది. ఆ పోస్టుకు పెట్టిన ఫొటోలో పైన విజయమ్మ కింద జగన్ ఫోటో ఉంది.నిజానికి ఇది నూరుశాతం పసలేని కామెంట్ అనే చెప్పాలి. పవన్ కల్యాణ్ ను జగన్  అండ్ కో దత్తపుత్రుడని, ప్యాకేజీస్టార్ అని పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దానికి కౌంటరుగా జనసేన జగన్ పై కన్నతల్లికే నమ్మకంలేదని, ప్రజలు ఎలాగ నమ్ముతారంటు పిచ్చి కామెంట్లు పెట్టారు. కన్నతల్లికి జగన్ పైన నమ్మకం లేక పక్క రాష్ట్రానికి పారిపోయిందనేది నూరుశాతం అబద్ధం. ఎందుకంటే కూతురు కష్టాల్లో ఉందికాబట్టి మద్దతుగా నిలబడటం కోసం తాను తెలంగాణాలో షర్మిల పక్కన ఉన్నట్లు స్వయంగా విజయమ్మే చెప్పారు.కొడుకు జగన్ పైన తనకు నమ్మకం లేక తెలంగాణాలో కూతురు దగ్గర ఉంటున్నట్లు విజయమ్మ ఎప్పుడూ చెప్పలేదు. ఇక రెండో కామెంట్ కన్నతల్లే నమ్మని జగన్ను జనాలు ఎలాగ నమ్ముతారు ? అన్నది. జనాలు ఆల్రెడీ జగన్ను నమ్మేశారు. జగన్ పైన జనాలకు నమ్మకం వచ్చింది కాబట్టే 151 సీట్ల అఖండ మెజారిటితో వైసీపీని గెలిపించింది.  జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకున్నారా ? జనాల ఆకాంక్షలకు తగ్గట్లుగా జగన్ పాలన ఉందా లేదా అన్నది తేలేది 2024 ఎన్నికల్లోనే. జగన్ను జనాలు నమ్మితే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు. ఇప్పటికైతే పవన్ను జనాలు నమ్మటంలేదని తేలిపోయింది కదా. పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్  ఓడిపోవటమే జనాలు నమ్మలేదనటానికి  నిదర్శనం. మరి జనాల్లో నమ్మకాన్ని పెంచటానికి పవన్ ఏమి చేస్తున్నారు ? పవన్  స్వీయ విశ్లేషణ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ 2019 ఎన్నికల రిజల్టే రిపీటవటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: