ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం: జగన్

Purushottham Vinay
ఇక డిల్లీలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఇంకా అలాగే స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారులు ముఖ్య మంత్రితో పాటు ఉన్నారు. ఈరోజు ( మంగళవారం) మధ్యాహ్నం జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు కర్టెన్ రైజర్‌ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని ఇంకా 6 పోర్టులు ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఆయన తెలిపారు. అలాగే మరో 4 ఏర్పాటవుతున్నాయని కూడా జగన్ చెప్పారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6 ఎయిర్‌ పోర్టులు ఉన్నాయని చెప్పారు.. ఇంకా అలాగే 3 పారిశ్రామిక కారిడార్లు కూడా ఉన్నాయని తెలిపారు. దాదాపు 80శాతం జిల్లాలు ఈ కారిడర్లలో ఉన్నాయని జగన్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.


సీఎం జగన్ మాట్లాడుతూ.. "2021-22 సంవత్సరాలలో 11.43 వృద్ధిరేటు సాధించాం. మూడు సంవత్సరాలుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నాం. ఎన్నో అవార్డులు సాధించాం. తయారీ రంగంలో చాలా క్లస్టర్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా బిజినెస్ మ్యాన్ లు ఈ ర్యాంకుల నిర్ధారణలో భాగస్వాములు. అలాంటి వారి ఫీడ్‌బ్యాక్‌ నుంచి ఈ ర్యాంకులు అనేవి ఇస్తున్నారు. మాకు సింగ్‌ డెస్క్‌ పోర్టల్‌ సదుపాయం కూడా ఉంది. కరెంటు, నీళ్లు విషయంలో పరిశ్రమలకు మంచి సరసమైన ధరలకే వస్తున్నాయి. రెన్యువబుల్‌ ఎనర్జీ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి చాలా పుష్కలమైన వనరులు ఉన్నాయి. ఇంకా 33 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు కూడా అవకాశం ఉంది. పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఎప్పుడు ఫోన్‌కాల్‌లో అందుబాటులో ఉంటాం. మళ్లీ మనం అందరం వైజాగ్‌లో కలుసుకుంటాం." అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: