నారా లోకేష్ "పాదయాత్ర" సక్సెస్ అవ్వాలంటే ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పేరుతో పాదయాత్రను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుండి మొదలైన ఈ యాత్ర మొత్తం 400 రోజుల పాటు కొనసాగనుంది. అయితే దురదృష్టవశాత్తూ నిన్న తారకరత్నకు జరిగిన ఘోరంతో టీడీపీ అంతా ఆందోళనలో ఉంది. అయితే తారకరత్న పరిస్థితి కుదుటపడలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ పాదయాత్ర మూలంగా టీడీపీకి లాభం చేకూరనుందా ? వైసీపీ పక్షాన ఉన్న ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకుంటాడా ? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉన్నాయి.
కాగా ఇప్పటి వరకు చూసుకుంటే కుప్పం నుండి నారా లోకేష్ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన ఉంది. అయితే వైసీపీ మాత్రం నారా లోకేష్ ను చాలా తేలికగా తీసుకుంటూ పాదయాత్రకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న ఏపీ ప్రజలు నారా లోకేష్ పాదయాత్ర వలన మరింతగా టీడీపీకి ఆకర్షితులయ్యే అవకాశం లేకపోలేదు. లోకేష్ ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు మాట్లాడిన విధానం కానీ, ప్రజలతో ఇంటరాక్ట్ అయిన విధానం కానీ చూస్తే చేజేతులా రాజకీయంగా ప్రజల మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడానికి వచ్చిన మంచి అవకాశాన్ని పాడుచేసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఎంతసేపూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి చెడుగా మాట్లాడడం , వారిని ప్రజలలో చెడుగా చిత్రీకరించే ప్రయత్నం లాగానే అతను మాటలు ఉన్నాయి తప్పించి... మాకు మీరు ఎందుకు ఓటు వెయ్యాలి ? మేము అధికారం లోకి వస్తే ఏమి చేయగలము ? అన్న విషయంపై దృష్టి సారించడం లేదు. ఇక నిన్నటితో మూడు రోజులు పూర్తి అయిపోయాయి. మిగిలిన 397 రోజులు అయినా సరిగా ఈ పాదయాత్రను వాడుకుని ఒక మంచి ప్రజా నాయకుడిగా ఎన్నికలకు వెళుతాడేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: