హైదరాబాద్ : పదిరోజుల ముందు పొత్తులా..అంత సీనుందా ?

Vijayaపొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక విచిత్రమైన విషయాన్ని ప్రకటించారు. అదేమిటంటే ఎన్నికల ప్రకనటకు పదిరోజుల ముందు మాత్రమే పార్టీలతో పొత్తుల చర్చలు చేస్తానని చెప్పారు. తన ప్రకటన వ్యూహాత్మకమా ? లేకపోతే అనాలోచితమా ? అన్నది ఎవరికీ అర్ధం కావటంలేదు. అసలు పదిరోజుల ముందు పొత్తులు ఏ పార్టీతో జరుపుతారు ?  ఏ పార్టీ అందుకు అంగీకరిస్తుంది ? అప్పటివరకు అభ్యర్ధుల విషయంలో మిగిలిన పార్టీలు ఏమిచేయాలి ? అనే విషయాలపై పవన్ కు క్లారిటి ఉన్నట్లు లేదు.ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకోవటాన్ని టీడీపీలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే పోటీచేసే అవకాశం తమకు ఎక్కడ మిస్సవుతుందో అనే టెన్షన్ చాలామంది నేతల్లో పెరిగిపోతోంది. రెండుపార్టీల మధ్య పొత్తులో జనసేనకు ఎన్నిసీట్లు వదులుకోవాల్సుంటుందో తెలీదు. పోయే నియోజకవర్గాలేవో కూడా చెప్పలేకున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా చంద్రబాబునాయుడు నియోజకవర్గల్లో అభ్యర్ధులను ప్రకటించటం మానేశారు. అలాగే సుమారు 40 నియోజకవర్గాల్లో ఇన్చార్జీలను కూడా నియమించలేదు.ఇప్పటికి నియోజకవర్గాల్లో  ప్రకటించిన  అభ్యర్ధులకు టికెట్ కూడా గ్యారెంటీలేకుండా పోయింది. ఇలాంటి అనేక కారణాల వల్ల జనసేనతో పొత్తును తమ్ముళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో  జనసేనకు ఉన్నదేమీ లేదు కాబట్టి కొత్తగా పోయేదేమీ లేదు. కానీ టీడీపీ విషయం అలాకాదు. పవన్ చెప్పినట్లుగా పదిరోజుల ముందువరకు పొత్తులు డిసైడ్ కాకపోతే టీడీపీ తరపున క్షేత్రస్ధాయిలో ఎవరు పనిచేయాలి. ఎవరు పనిచేసినా, ఎవరు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకున్నా రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసమే అని అందరికీ తెలుసు.అలాంటిది ఎన్నికల ప్రకటనకు పదిరోజుల ముందు మాత్రమే పొత్తు విషయాన్ని చర్చిస్తామని పవన్ చెప్పటంలోనే తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నట్లయ్యింది. అప్పటివరకు ఎవరూ కామ్ గా కూర్చోరు. చూడబోతే  ప్రతిపక్షాలన్నింటినీ తన అజ్ఞానంతో నిండా ముంచేసేట్లున్నారు. నిజంగానే పద్దతైన రాజకీయం చేసేట్లయితే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడరు. మరి పవన్ కు ఇలాంటి సలహాలు ఎవరిచ్చారో ఏమో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: