కర్ణాటకలో కేసీఆర్ పార్టీకి నో ఛాన్స్... హ్యాండిచ్చిన జెడియు నేత కుమారస్వామి ?

VAMSI
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు తన దృష్టిని మళ్ళించాడు. అందులో భాగంగా మొదటగా తన పార్టీని సైతం తెరాస నుండి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. నిజంగా ముందు నుండి కేసీఆర్ మనసులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న కుతూహలం ఉన్నా , పార్టీ పేరును మారుస్తారని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గా చెప్పుకునే పార్టీని మార్చడం పట్ల కొందరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేసీఆర్ కొన్ని రాష్ట్రాల కీలక నాయకులను కలుపుకుని వెళ్ళడానికి కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామిని సైతం కలిసి మద్దతు తెలిపామని కోరిన విషయం తెలిసిందే.
అప్పట్లో జేడీఎస్ నేత కుమారస్వామి కూడా అప్పట్లో హైదరాబాద్ కు వచ్చి ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి తన మద్దతు పలికారు. అంతే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ పెట్టే ముందు మరియు ఢిల్లీ లో పార్టీ కార్యాలయం ఓపెన్ చేసే సమయంలోనూ కుమారస్వామి కేసీఆర్ పక్కనే ఉన్నారు. కానీ రెండు రోజుల ముందు ఖమ్మంలో కేసీఆర్ పెట్టిన బి ఆర్ ఎస్ సభకు మాత్రం కుమారస్వామి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఎందుకు రాలేదన్న దానికి కారణంగా కుమారస్వామి కర్ణాటకలో రథయాత్రలో బిజీగా ఉండడం రమ్మని పిలవలేదు అంటున్నారు.
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో జెడియు బి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోదని... అన్ని స్థానాలలోనూ మేమే పోటీ చేస్తామంటూ ఆ పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఇక సీఎం కాండిడేట్ కుమారస్వామి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని, వీలుంటే లోక్ సభ ఎన్నికలలో చూస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనితో ఆదిలోనే హంసపాదు లాగా కేసీఆర్ కు చుక్కెదురవనుందని స్పష్టంగా తెలుస్తోంది. మరి చూద్దాం ఈలోపు ఏమైనా రాజకీయ సమీకరణాలు మారుతాయా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: