నేదురుమల్లి దెబ్బకు... మాజీ మంత్రి ఆనంకు ఎక్కడో కాలుతోందిగా ?

VAMSI
ఏపీ రాజకీయాలు ఇప్పుడు 2024 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ లను దక్కించుకుని అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లకు దగ్గర పడుతోంది. రాష్ట్రంలో చెప్పుకోవడానికి సంక్షేమం మరియు సచివాలయం మినహా ఏమీ లేదు. వాస్తవానికి ఈ రెండింటి వలనే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాగా ఈసారి జగన్ ఎన్నికల టార్గెట్ 175 సీట్లుగా పెట్టుకుని ముందుకు వెళుతున్నాడు. అందులో భాగంగా సర్వేల ప్రకారం గెలవడం సందేహం అన్న నియోజకవర్గాలు మరియు సొంత పార్టీపైనే తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యే ల నియోజకవర్గాలపైన ఎక్కువ శ్రద్ద పెట్టారు సీఎం జగన్.
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గత ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం తరపున వైసీపీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందిన విషయం తెలిసిందే. కానీ సీనియర్ నాయకుడిగా ఆనం మంత్రి పదవిని ఆశించారు.. రెండు సార్లు మంత్రి వర్గ విస్తరణ జరిగినా నిరాశ తప్పలేదు.  అలా మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో ఆనం పదే పదే వైసీపీ పై మరియు ప్రభుత్వంపై డైరెక్ట్ గా విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. ఒకటి రెండు సార్లు గమనించి మందలించినా పెడచెవిన పెట్టిన ఆనం తన తీరును మార్చుకోలేదు. దీనితో జగన్ తనదైన శైలిలో ఆనంపై వేటు వేశాడు . వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించాడు, అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి పేరునే ఖరారు చేశారు.
నియోజకవర్గంపై ఫుల్ హక్కులు పొందిన రామ్ కుమార్ రెడ్డి తన స్టైల్ లో పార్టీని అభివృద్ధి చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా తాజాగా మండలాల వారీగా ఇంచార్జి లను నియమించాడు. బాలాయపల్లి మండలానికి తాళ్లూరు వేంకట బంగారు ప్రసాద్, డక్కిలి మండలానికి చింతల శ్రీనివాసులు రెడ్డి, కలువాయి కి మాదాసు పవన్ , రాపూరు మండలానికి దండాలు లక్ష్మి నారాయణ రెడ్డి , సైదాపురం మండలానికి మన్నారు రవి కుమార్, వెంకటగిరి రురల్ కు ములవాయి వెంకటేశ్వర్లు మరియు వెంకటగిరి మున్సిపాలిటీకి పులి ప్రసాద్ లను ఇంచార్జి లుగా నియమించారు. అయితే ఎమ్మెల్యేగా తన పదవీకాలం ఇంకా ఉన్నప్పటికీ రామ్ కుమార్ రెడ్డి అజమాయిషీని చూసి ఆనం రామనారాయణరెడ్డికి కాలుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: