"ఎన్నికల మేనిఫెస్టో"పై చంద్రబాబు పూర్తి దృష్టి !

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలకు సంవత్సరం కు పైగానే సమయం ఉన్నప్పటికీ అప్పుడే వ్యూహాలు, ప్రతివ్యూహాలు , సీట్లు మరియు నియోజకవర్గాల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇదంతా ప్రతిసారి ఉండేదీ అయినా 2024 ఎన్నికలు మాత్రం చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలు ఒక సీనియర్ నాయకుడి భవితవ్యాన్ని తేల్చనున్నాయని గత కొంతకాలంగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కొత్త పార్టీగా ఉన్న వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుని పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో కొంత ప్రజలలో ప్రభుత్వంపై మంచి పేరు ఉందని తెలుస్తోంది. కానీ ఎక్కువ శాతం మాత్రం వ్యతిరేకత ఉందన్న విషయాన్ని కొట్టి పారెయ్యలేము.
అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరియు టీడీపీ కూటమికి గెలవడానికి సమానమైన అవకాశాలు ఉన్నాయి. కానీ వీరు ప్రజల వద్దకు తీసుకువెళ్లే మేనిఫెస్టో మీదనే ఓట్లు ఎటు వైపుకు పడుతాయి అన్నది ఆధారపడి ఉంటుంది. మరోసారి జగన్ సారధ్యంలోని వైసీపీ ప్రజల ముందుకు సంక్షేమాన్ని ఆయుధంగా చెప్పుకుని ఓట్లను అడిగే పరిస్థితి. ఇది మాత్రమే కాకుండా ప్రజలు సంతృప్తి పడిన సచివాలయ వ్యవస్థను మరింత మార్పులు చేసి ఇంకా ఎక్కువ స్థాయిలో సేవలను ప్రజలకు అందించడానికి కూడా కృషి చేయడానికి జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నాడట.
ఇక ప్రతిపక్ష టీడీపీ గతంలో చాలా మేనిఫెస్టోలు తయారుచేసింది... కానీ వాస్తవరూపం దాల్చింది కొన్ని మాత్రమే అని రుజువు చేశారు ఏపీ ప్రజలు. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు అంతా కలిసి కేవలం 21 సీట్లకే పంరితం చేశారు. దాని నుండి తేరుకోవడానికి ఇంకా టైం పట్టేలా ఉంది చంద్రబాబు అండ్ కో కి, అందుకే ఈసారి నెరవేర్చడానికి వీలు అయ్యే అంశాలను మాత్రమే మానిఫెస్టోలో చేర్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదొక్క విషయంలో కనుక చంద్రబాబు తెలివిని ప్రదర్శిస్తే ప్రజల మనసు మారే అవకాశం ఉంది. మరి చంద్రబాబు ఏ విధంగా తన మేనిఫెస్టోను రెడీ చేస్తాడు అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: