అమరావతి : తమ్ముళ్ళలో టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya

సుబ్బిపెళ్ళి ఎంకిచావుకు వచ్చిందనే సామెత చాలా పాపులర్.  ఈ సామెత టీడీపీలోని ఆశావహులకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే రణస్ధలం బహిరంగసభ ద్వారా తెలుగుదేశంపార్టీ-జనసేన పొత్తులు ఖాయమైపోయాయి కాబట్టి. రణస్ధలం బహిరంగసభలో పవన్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే టార్గెట్ గా టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రకటించారు. జనసేన ఒంటరిగా పోటీచేస్తే 2019 ఎన్నికల్లో లాగే 2024లో కూడా వీరమరణం తప్పదని పవన్ డిసైడ్ అయిపోయారు.



సో, వీరమరణం పొందేబదులు టీడీపీ  పొత్తు పెట్టుకుంటామని పవన్ క్లారిటి ఇచ్చారు.  రెండుపార్టీల మధ్య పొత్తుంటుందని అందరు అనుకుంటున్నదే. అయితే ఆ విషయమై క్లారిటి వచ్చింది మాత్రం ఇపుడే. టీడీపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల జనసేనకు జరిగే నష్టమేమీలేదు. ఇదే సమయంలో తమ్ముళ్ళు మాత్రం భారీగానే నష్టపోతారు. ఎలాగంటే వచ్చేఎన్నికల్లో పోటీచేసే విషయంలో ఇప్పటికే తమ్ముళ్ళు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టారు. టికెట్ పై హామీ ఇవ్వకపోయినా, నియోజకవర్గం ఇన్చార్జిగా ప్రకటించకపోయినా టికెట్ తమకే ఇస్తారనే ఆశతోనే నేతలు లక్షల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు.



కొందరు నేతలతో చంద్రబాబునాయుడు, లోకేష్ విడివిడిగా మాట్లాడినపుడు టికెట్ మీకే దక్కుతుందని, కష్టపడి పనిచేయండని చెబుతున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అలాంటిది ఇపుడు జనసేనతో పొత్తంటే ఏ నియోజకవర్గాలు పోతాయో తెలీక తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకాలం టికెట్ వస్తుందన్న ఆశతో చేసిన ఖర్చులన్నీ వృధాయేనా అన్న గోల మొదలైపోయింది.



ఉభయగోదావరి, రాయలసీమ, ఉత్తరాంధ్రలో పోటీచేయటం పైనే పవన్ ఎక్కువగా దృష్టిపెట్టారనే ప్రచారం అందరికీ తెలిసిందే. జనసేన పోటీచేయాలని అనుకుంటున్న 70 నియోజకవర్గాల జాబితాను పవన్ ఇప్పటికే చంద్రబాబుకు అందచేశారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో 70 నియోజకవర్గాలు కాదు 45 నియోజకవర్గాలని మరో ప్రచారం ఊపందుకుంది. నియోజకవర్గాల సంఖ్యపై స్పష్టత లేకపోయినా ఇపుడు టీడీపీ సిట్టింగ్ సీట్లపైన కూడా జనసేన దృష్టిపెట్టిందనే ప్రచారం అందరిలోను కలవరం పెంచేస్తోంది. పవన్ కోరుకున్న గౌరవం, మర్యాద పక్కనపెట్టేస్తే తమ్ముళ్ళల్లో టెన్షన్ మాత్రం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: