హైదరాబాద్ : కేసీయార్ తప్పు చేస్తున్నారా ?

Vijaya



ఖమ్మం జిల్లా నేతల విషయంలో కేసీయార్ తప్పు చేస్తున్నారనే అనిపిస్తోంది. తనకు బాగా సన్నిహితులే కాకుండా బలమైన రెండుసామాజికవర్గాలకు చెందిన నేతలను వదులుకోవటానికి కేసీయార్ సిద్ధపడటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరవు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి బీఆర్ఎస్ నుండి బయటకు వెళిపోవటం గ్యారెంటీ అనే అనిపిస్తోంది. పొంగులేటి తర్వాత అడుగు బీజేపీలోకే అనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. తుమ్మల అడుగులు ఎటువైపు అనే విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యు అవుతోంది.



ఇక్కడ గమనించాల్సిందేమంటే తుమ్మలయినా పొంగులేటయినా జనబలం ఉన్న నేతలు. పైగా వాళ్ళ సామాజికవర్గాల్లో బలమైన మద్దతున్న నేతలు. ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి లాభమే తప్ప నష్టముండదు. వీళ్ళగురించి కేసీయార్ కు బాగా తెలుసు. అయినా వీళ్ళిద్దరిని వదులుకోవటానికి సిద్ధపడటమే ఆశ్చర్యంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఇగే ప్రాబ్లమే అని సమాచారం. కేసీఆర్ కు తుమ్మల, పొంగులేటి బాగా సన్నిహితులే కానీ కేటీయార్ తో గొడవలున్నాయట. అందుకనే జిల్లాలో వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా కేటీయార్ ప్రత్యామ్నాయ నేతలను ప్రోత్సహించారనే ప్రచారముంది.



కేటీయార్ మాటను కాదనలేక కేసీయార్ కూడా వీళ్ళని దూరంగా పెట్టేశారు. దూరంగా పెట్టడమే కాకుండా పార్టీలో అవమానాలు కూడా ఎదురయ్యాయి. దాంతో బీఆర్ఎస్ లో ఇక తమకు చోటులేదని వీళ్ళిద్దరు తీర్మానించుకున్నారు.




వీళ్ళిద్దరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ మేరకు బీఆర్ఎస్ కు నష్టం జరగటం ఖాయం. పొంగులేటి మళ్ళీ బీజేపీ ఎంపీగానే పోటీచేస్తారు. అప్పుడు సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు బాగా నష్టం జరుగుతుంది. పాలేరులో తుమ్మల పోటీవల్ల ఇక్కడా బీఆర్ఎస్ నష్టపోవటం ఖాయం. ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా తుమ్మల, పొంగులేటి  మద్దతుదారులు వ్యతిరేకంగా పనిచేయటం వల్ల  బీఆర్ఎస్ అన్నీ నియోజకవర్గాల్లోను నష్టపోతుంది. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లవుతుంది కేసీయార్ వ్యవహారం. ఇంతచిన్న లాజిక్ కేసీయార్ ఎలాగ మరచిపోయారో అర్ధంకావటంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: