హైదరాబాద్ : ఇద్దరిలోను టెన్షన్ పెరిగిపోతోందా ? భేటీకి కారణమిదేనా ?

Vijayaక్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో  చంద్రబాబునాయుడుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీళ్ళభేటీకి పైకి చెబుతున్న కారణాలు ఒకటైతే లోలోపల జరుగుతున్నది వేరేగా ఉంటుందని అందరికీ తెలిసిందే. కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ఎదురైన ఇబ్బందులను పరామర్శించేందుకు పవన్ వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం వేరే ఉండచ్చని చాలామందికి అనుమానంగా ఉంది.ఎందుకంటే కుప్పంలో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. రోడ్డుషోలు, సభలు పెట్టుకోవాలని అనుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారంతే. అయితే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులను, పోలీసుల ఆంక్షలను యధేచ్చగా ఉల్లంఘించారు. పైగా రోడ్లపై ప్రదర్శనగా వెళ్ళటమే కాకుండా కొన్నిచోట్ల  ఇంటింటికి కూడా తిరిగారు. పోలీసుల ఆంక్షల వల్ల చంద్రబాబుకు మేలు జరిగింది తప్ప ఎక్కడా సమస్యలు రాలేదు. పోలీసుల ఆంక్షలే లేకపోతే చంద్రబాబు ఇంటింటికి తిరిగే వారే కాదు.మరింతోటిదానికి చంద్రబాబును పవన్ పరామర్శించటమేంటి ? అసలు చంద్రబాబు మూడురోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నదే ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించటం కోసమే అని అందరికీ తెలుసు. కుప్పం పర్యటనలో చంద్రబాబు తాను అనుకున్నది అనుకున్నట్లు చేశారే కానీ ఎక్కడా ఇబ్బందులు పడలేదు. చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డం పెట్టుకుని పొత్తుల విషయంపైన మాట్లాడటమే హిడెన్ అజెండా అని అనుమానంగా ఉంది. బీజేపీతో జనసేన మిత్రపక్షమనే కానీ ఆచరణలో అది ఎక్కడా కనబడటంలేదు.బీజేపీతో కలిసి నడవలేక అలాగని ధైర్యంగా వదిలేసి రాలేక పవన్ నానా అవస్తలు పడుతున్నారు. బీజేపీని వదిలించుకునే మార్గం అర్ధంకాక పవన్ దిక్కులు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఏదో ఒకటి తేల్చుకోకపోతే రేపటి ఎన్నికల్లో మళ్ళీ భంగపాటు తప్పదని ఇద్దరికీ తెలుసు. పైగా బీఆర్ఎస్ ఏపీ ఎంట్రీ ఇద్దరినీ కలవర పెట్టేస్తోంది.  బీజేపీతో తాడేపేడో తేల్చుకునే ఉద్దేశ్యంలో పవన్ ఉన్నట్లున్నారు. అందుకనే చంద్రబాబుతో భేటీ అయ్యారు. బహుశా సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల్లాంటి వాటిపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇపుడు కూడా తొందరపడకపోతే వచ్చేఎన్నికల్లో రెండుపార్టీలు దెబ్బతినటం ఖాయమని ఇద్దరికీ అర్ధమైంది. అందుకనే హఠాత్తుగా భేటీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: