హైదరాబాద్ : ఈ పార్టీలకు ఎవరినుండి దెబ్బపడుతుందో ?

Vijayaవచ్చేఎన్నికల్లో తెలంగాణాలో చాలాపార్టీలే  పోటీచేయబోతున్నాయి.  ఇప్పటి అంచనాల ప్రకారం సుమారు ఎనిమిదిపార్టీలు పోటీచేసే అవకాశాలున్నాయి. వీటిలో ప్రధానమైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాకుండా రెండు వామపక్షాలు, బీఎస్పీ, వైఎస్సార్టీపీ, జనసేన తరపున అభ్యర్ధులు రంగంలో ఉండబోతున్నారు. వీటిల్లో ఏ పార్టీలు పెత్తుకుంటాయి, ఏ పార్టీ సొంతంగా పోటీచేస్తుందనే విషయమై ఇప్పటికైతే క్లారిటిలేదు. బీఆర్ఎస్ తో వామపక్షాలకు పొత్తుంటుందని అందరు అనుకుంటున్నారు.
ఇక బీజేపీ, కాంగ్రెస్ విడిగా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టీడీపీ, జనసేన, వైఎస్సార్టీపీలు దేనికదే పోటీచేస్తాయనే ప్రచారం పెరిగిపోతోంది. మూడు ప్రధానపార్టీల  విషయాన్ని పక్కనపెట్టేస్తే మిగిలిన రెండు వామపక్షాలు, బీఎస్పీ, టీడీపీ, జనసేన, వైఎస్సార్టీపీలు అన్నీ కలిపి సింగిల్ డిజిట్ సీట్లు దాటే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. కాకపోతే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయన్నది ఇపుడు చెప్పటం కష్టమే. ఇదే సందర్భంలో పెద్దపార్టీలకు ఎంతోకొంత నష్టం జరగటం ఖాయమనే టాక్ నడుస్తోంది. వామపక్షాలకు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలముంది. వైఎస్సార్టీపీకి ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో బలముందని ప్రచారం జరుగుతోంది. బీఎస్పీకి పలానా జిల్లా అని లేదుకానీ చాలా నియోజకవర్గాల్లో ఎస్సీల ఓట్లు పడే అవకాశముంది. ఇక టీడీపీకి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో 5 వేలలోపు ఓట్లు పడే అవకాశాలున్నాయని తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు. ఫైనల్ గా జనసేన గురించి ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఈ ఐదుపార్టీల అభ్యర్ధులు కొన్నినియోజకవర్గాల్లో తాముగెలవటం కన్నా ప్రధానపార్టీలకు పడే ఓట్లను చీల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీనికారణంగా ఈపార్టీలప్రభావం ఏపార్టీ అభ్యర్ధిపైన పడుతుంది అనే చర్చలు పెరిగిపోతున్నాయి. సో, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తుంటే పెద్ద పార్టీలకు చిన్న పార్టీల నుండి ఎంతోకొంత దెబ్బపడటం ఖాయమని అర్ధమైపోతోంది. కాకపోతే వీటి ప్రభావం ఏ స్ధాయిలో  ఉంటుంది, ఎవరిపైన దెబ్బపడుతుందని తేలాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ కేసీయార్ ముందస్తుకు రెడీ అయిపోతే అప్పుడు మరింత తొందరగా క్లారిటి వచ్చేయటం ఖాయం.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: