నాన్నకు ప్రేమతో.. కూతురు ఇచ్చిన గిఫ్ట్ కి అందరూ ఫిదా?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఎన్ని రకాల బంధాలు ఉన్నప్పటికీ అటు తండ్రీ కూతుర్ల బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తండ్రి తన కూతురిని ఏకంగా రెండో అమ్మగా భావిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అందుకే ఇక కుటుంబ సభ్యులందరూ దగ్గర ఎంతో గంభీరంగా ఉండే తండ్రి  కూతురు దగ్గరికి వచ్చేసరికి మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతు ఉంటాడు. ఏకంగా పెద్ద హోదాలో ఉన్న కూతురుతో చిన్నపిల్లాడిలా ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు తండ్రి. అంతే కాదు తండ్రి కూతుర్ల బంధం లో ఉండే ప్రేమానురాగాలు చూస్తూ ఉంటే ఎప్పుడు ముచ్చటేస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 అంతేకాదు కూతురు ఏదైనా కావాలని కోరింది అంటే చాలు అది ఎంత కష్టమైనా సరే తండ్రి ఇక దానిని తెచ్చి ఇస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక కూతురు బర్త్ డే వచ్చిందంటే చాలు ఏదో ఒకటి కొత్తగా సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. అయితే ఇటీవల కాలంలో తండ్రి కూతురికి సర్ప్రైజ్ ఇవ్వడం కాదు ఏకంగా కూతుర్లు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా ఇక తండ్రి పుట్టిన రోజు నాడు ఏదో ఒక బిగ్ సర్ ప్రైస్ ఇస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 ఇటీవల రీద తరానా అనే కంటెంట్ క్రియేటర్, మోడల్ కూడా ఇక ఇలా తన తండ్రి పుట్టిన రోజు నాడు ఊహించని బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తన తండ్రి పది సంవత్సరాల క్రితం ఎరుపు రంగు నానో కారు కొన్నారు అంటూ చెప్పకు వచ్చింది.కానీ చాలా సంవత్సరాలుగా కొత్త కారు కొనాలని కోరికతో ఎదురుచూస్తున్నారు. అందుకే నాన్నకు తెలియకుండా ఆయనకు ఇష్టమైన కారు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాను. ఇక ఈ సంవత్సరం నాన్న పుట్టినరోజు..  అంటూ చెబుతూ చివరికి కారు బహుమతితో తండ్రికి సర్ ప్రైస్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మా నాన్న కల నిజమైంది అంటూ  చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో కాస్త ఎంతోమంది ఆడపిల్లల తండ్రుల హృదయాలను తాకుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: