హైదరాబాద్ : తెలంగాణాలో చంద్రబాబు అంచనా ఏమిటో తెలుసా ?

Vijaya




తెలంగాణాకు సంబంధించి వచ్చేఎన్నికల్లో టీడీపీ యాక్టివ్ పార్ట్ తీసుకోబోతున్నట్లు    చంద్రబాబునాయుడు ప్రకటించారు. యాక్టివ్ పార్ట్ అంటే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ పోటీచేయబోతున్నట్లే అనుకోవాలి. వాస్తవానికి టీడీపీ పోటీచేయటం కాదుకదా కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా గట్టి అభ్యర్ధిని నిలిపే పరిస్ధితుల్లో కూడా లేదు. కారణం ఏమిటంటే పార్టీ వ్యవస్ధ దాదాపు నేలమట్టమైపోయింది. పార్టీకి ఇంకా అక్కడక్కడ క్యాడర్ ఉందికానీ నేతలైతే కనిపించటమే లేదు.



ఇదే విషయమై తెలంగాణా వ్యాప్తంగా తమ్ముళ్ళు ఈమధ్య సర్వే చేయించారని సమాచారం. టీడీపీ గనుక పోటీచేస్తే 25 నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు తలా 5 వేల ఓట్లు పడే అవకాశముందని తేలిందట. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి కాస్త ఓటింగ్ మిగిలుందని తేలిందట. దీని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం.



పార్టీకి 25 నియోజకవర్గాల్లో తలా 5 వేల ఓట్లున్నాయంటే  మామూలు విషయంకాదు. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీయార్ గట్టిపట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తున్నాయి. అంటే 119 నియోజకవర్గాల్లో చాలాచోట్ల  త్రిముఖ పోటీ కారణంగా టైట్ ఫైట్ జరిగే అవకాశాలున్నాయి. ఇలాంటపుడు గెలిచిన అభ్యర్ధికి పెద్దగా మెజారిటి వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి.



సరిగ్గా ఈ పాయింట్ ఆధారంగానే టీడీపీ ఎంటరవ్వాలని అనుకుంటోంది. తమకున్నాయని అనుకుంటున్న 5 వేల ఓట్లతో  ఎక్కడకూడా టీడీపీ గెలవలేందు సరికదా కనీసం డిపాజిట్టు కూడా తెచ్చుకోలేందు.  నిజంగానే టీడీపీకి గనుక 5 వేల ఓట్లుంటే గెలుపోటములను శాసించగలదనటంలో సందేహంలేదు. కొందరు అభ్యర్ధులు సింగిల్ డిజిట్ నుండి వందల ఓట్ల మెజారిటితో గెలుస్తున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో 5 వేల ఓట్లుండటం గొప్పే. ఈ సర్వే రిపోర్టు అందిన తర్వాతనే తెలంగాణాలో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. మరి చంద్రబాబు ఏ రూపంలో సక్సెస్ అవుతారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: