రాయలసీమ : చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ? అసలు కారణమిదేనా ?

Vijaya




మూడురోజుల పర్యటనలో తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు వ్యవహరించారు. మామూలుగా అయితే లేస్తే మనిషిని కాను అన్నట్లుగా చంద్రబాబు బెదిరించి ఎదుటివారిని తన దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేకానీ ఎదుటివారితో నేరుగా  ఘర్షణకు దిగారు. ఎదుటివారు పోలీసులు అయితే కాస్త ఆవేశంగా మాట్లాడి వాళ్ళని వెళ్ళిపోయేట్లు చేస్తారంతే. కానీ బుధవారం కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలంలో  జేపీకొత్తూరు గ్రామానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.



ఎప్పుడైతే పోలీసులు తనను అడ్డుకున్నారో వెంటనే పెద్దగా అరుస్తు చంద్రబాబు గొడవలకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలను అమలుచేస్తున్నా పోలీసులతో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే ఘర్షణకు దిగారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టకముందు కూడా రెండుమూడు గ్రామాల్లో నేతలు, కార్యకర్తలు పోలీసులతో పెద్దఎత్తున గొడవలకు దిగారు. ఇదంతా చూస్తుంటే ఒక వ్యూహం ప్రకారమే చంద్రబాబు జరిపించారని అనుమానంగా ఉంది.



విషయం ఏమిటంటే కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బాగా డీలాపడిపోయున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన దగ్గర నుండి టీడీపీ నేతల్లో నైరాస్యం కనబడుతోంది. దానికితోడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. అందుకుతగ్గట్లే పార్టీ, ప్రభుత్వ యంత్రంగంలో జోరుపెంచారు. దీంతో చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళల్లో కూడా టెన్షన్ బాగా పెరిగిపోతోంది. ఇదే పద్దతి మరికొంతకాలం కంటిన్యు అయితే చివరకు జగన్ అనుకున్నదే జరుగుతుందేమో అన్న అనుమానాలు పెరిగిపోతోంది.



ఈ వాతావరణాన్ని ఎలా బ్రేక్ చేయాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం  రోడ్డుషోలు, రోడ్డుమీద సభలు, ర్యాలీలను నిషేధించింది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చంద్రబాబు అనుకుని అప్పటికప్పుడు కుప్పం పర్యటన ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్లే నేతలు, క్యాడర్ ఎక్కడికక్కడ పోలీసులతో ఘర్షణలకు దిగారు. తర్వాత ఇదే వాతావరణాన్ని చంద్రబాబు కూడా కంటిన్యుచేశారు. తాను జగన్ అంటే భయపడటంలేదని ఎవరితో అయినా ఘర్షణ పడటానికి సిద్ధమే అన్న సిగ్నల్స్ చంద్రబాబు నేతలు, క్యాడర్ కు పంపారు. 



మూడేళ్ళుగా భయపడుతున్న తమ్ముళ్ళు పోలీసులతో రెచ్చిపోయి గొడవలకు దిగటానికి చంద్రబాబు పంపిన సంకేతాలే కారణం. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో కూడా ఇంకా భయపడుతు కూర్చుంటే లాభంలేదని చంద్రబాబు గ్రహించారు. తాను భయపడితే నేతలు, క్యాడర్ అడ్రస్ ఉండరని అర్ధమైంది. ఇపుడు కూడా తెగించి పోరాడకపోతే రేపటి ఎన్నికల్లో అసలు రోడ్లమీద తిరిగే అవకాశమే ఉండదేమో అన్న భయం పెరిగిపోతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ధైర్యంగా తెగించారు. ఇందులో భాగమే కుప్పంలో జరిగిన యాక్షన్ సీన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: