అమరావతి : జనసేనతో బీజేపీ విభేదించిందా ?

Vijaya
జరిగింది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. విజయవాడలో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బయట ప్రెస్ మీట్లలో ప్రభుత్వంపై ఏవైతే మాట్లాడుతున్నారో, ఆరోపణలు చేస్తున్నారో వాటినే తిరిగి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా రిపీట్ చేశారు. కాబట్టి రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇంకేదో బ్రహ్మాండమైన సమావేశం జరిగిందనుకునేరు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వామపక్షాల నేతలతో పాటు జై భీం, జనసేన నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ నేతలు ఎవరూ హాజరుకాలేదు. ఇక్కడే జనసేన-బీజేపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ హాజరుకాకుండా కందుల దుర్గేష్ ను పంపారు. అంటే సమావేశాన్ని బొత్తిగా తీసేయకుండా ఇదే సమయంలో తమ తరపున ఒక ప్రతినిధి ఉండాలన్నట్లుగా దుర్గేష్ ను పంపారు.అయితే బీజేపీ తరపున అధ్యక్షుడు సోమువీర్రాజు ఎవరినీ పంపలేదు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ సందర్భంగా మిత్రపక్షాల మధ్య ఉన్న విభేదాలు అందరికీ మరోసారి తెలిశాయి.  జనసేన ఏమో చంద్రబాబునాయుడు పల్లకీని మోయటానికి ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నట్లు సిగ్నల్ పంపుతోంది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం దూరంగానే ఉంటోంది. అంటే తాము చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామనే సంకేతాలను పార్టీ శ్రేణులకే కాకుండా ఇతర పార్టీలతో పాటు మామూలు జనాలకు కూడా పంపుతోంది. చూస్తుంటే తొందరలోనే ఈ రెండుపార్టీల మధ్య బ్రహ్మాండమేదో బద్దలయ్యేట్లే అనుమానంగా ఉంది.దీనివల్ల అందరికీ అర్ధమవుతున్నదేమంటే తగిన సమయం వచ్చినపుడు బీజేపీని వదిలిపెట్టేసి టీడీపీ జట్టుకట్టడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ పదేపదే కమలనాదులకు సంకేతాలు పంపుతున్నారు. సంకేతాలకు తగ్గట్లే క్షేత్రస్ధాయిలో డెవపల్మెంట్లు జరుగుతున్నాయి. మొదటినుండి బీజేపీ నేతలతో కలిసి పవన్ ఉమ్మడి కార్యక్రమాలను చేసిందేమీలేదు. ఇప్పుడూ అదే పద్దతిని కంటిన్యు చేస్తున్నారు. కాబట్టి వచ్చేఎన్నికలకు సంబంధించి పవన్ పొత్తు ఆలోచనలు ఏమిటనేది మెల్లిగా  బయటపడుతోంది.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: