అమరావతి : పవన్ కు గట్టి షాక్ ఎదురవబోతోందా ?

Vijaya






వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయబోతున్నట్లు కలలు కంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు గట్టి షాక్ ఎదురవబోతోంది. ఆ షాక్ కూడా జగన్మోహన్ రెడ్డి రూపంలో కాకుండా కేసీయార్ రూపంలో రాబోతుండటమే ఇంట్రెస్టింగ్.  ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ నుండి కాపులను, బీసీలను వీలైనంతగా దూరంచేయాలని పవన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం తనకున్న మార్గాల్లో చాలా ప్రయత్నాలే చేస్తున్నారు.



ఇదే సమయంలో చంద్రబాబునాయుడు కూడా బీసీలు, కాపుల మద్దతుకోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఉద్దేశ్యం ఏమిటంటే పై రెండువర్గాలను జగన్ కు దూరంచేస్తే అధికారం తమకు వచ్చేసినట్లే అనే భావనలో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి పోటీచేస్తారా లేకపోతే ఎవరికివారుగా పోటీచేస్తారా అన్న విషయంలో ఇప్పటికే రకరకాల కాంబినేషన్లు ప్రచారంలో ఉన్నవిషయం తెలిసిందే. ఏదేమైనా ఇద్దరి ఉమ్మడి శతృవు జగనే కాబట్టి ఏదోరూపంలో ఇద్దరు చేతులు కలిపే అవకాశాలున్నాయి.



సరిగ్గా ఇక్కడే వీళ్ళ ప్లాన్లకు అంటే ముఖ్యంగా పవన్ వ్యూహాలకు షాక్ కొట్టే డెవలప్మెంట్ జరుగుతోంది. అదేమిటంటే  వచ్చేఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏపీలో పోటీచేయబోతోంది. ఎంతమంది పోటీచేస్తారు ? గెలుస్తుందా లేకపోతే ఓడుతుందా అన్నది వేరేసంగతి. ఎన్ని ఓట్లు వీలైతే అన్ని ఓట్లు సాధించుకోవాలని కేసీయార్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఏపీలోని బీసీ సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు.



ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని యాదవ కులసంఘాల్లోని కొందరితో సమావేశమయ్యారు. తొందరలోనే గౌడ్లు, శెట్టిబలిజల్లోని ముఖ్యులతో కూడా భేటీలకు గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఉభయగోదావరి, రాయలసీమ ప్రాంతాలపైనే కేసీయార్ ఎక్కువ దృష్టిపెట్టినట్లు టాక్. ఇపుడు జనసేనకు ఎదురవ్వబోయే సమస్య ఏమిటంటే పవన్ కూడా పై రెండుప్రాంతాల్లోనే ఎక్కువ దృష్టిపెట్టారు. బీసీ సంఘాలతో సమావేశాలు అయిన తర్వాత కాపు సంఘాలతో కూడా సమావేశానికి రెడీ అవుతున్నారట. చూస్తుంటే కేసీయార్ ముందు పవన్ కు తర్వాత చంద్రబాబుకు పెద్ద షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: