హైదరాబాద్ : చంద్రబాబుకు తెలంగాణాలో డేంజర్ బెల్స్

Vijaya


చంద్రబాబునాయుడు ఇలా తెలంగాణాలో అడుగుపెట్టారో లేదో వెంటనే అలా డేంజర్ బెల్స్ వినిపించాయి. తెలంగాణా టీడీపీపై కల్వకుంట్ల కవిత, హరీష్ రావు రెచ్చిపోయారు. మామూలుగా చంద్రబాబు రాజకీయంపై కేసీయార్, కేటీయార్ మాట్లాడేవారు. అయితే వివిధ కారణాలతో వాళ్ళు బిజీగా ఉండటంతో ఆ బాధ్యతలను కవిత, హరీష్ అందుకున్నట్లున్నారు. వీళ్ళతో పాటు కొందరు నేతలు కూడా చంద్రబాబుపై విరుచుకుపడిపోయారు.
తెలంగాణాలో టీడీపీని జనాలు ఎప్పుడో భూస్ధాపితం చేసేసినట్లు కవిత, హరీష్ కామెంట్ చేశారు. జనాలు చంద్రబాబును ఎప్పుడో తిరస్కరించారని ఇంకా ఎందుకు పదేపదే పార్టీని బతికించుకోవాలని ట్రై చేస్తున్నారంటు నిలదీశారు. 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కేసీయార్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను కూడా నేతలు గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కవిత, హరీష్, నేతలు మాట్లాడిన విధానం చూస్తుంటే చంద్రబాబుపై విరుచుకుపడేందుకు రెడీగా కాచుకుని కూర్చున్నట్లే అనిపిస్తోంది.చంద్రబాబును బూచిగా చూపించి 2018 ఎన్నికల్లో కేసీయార్ లబ్దిపొందిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఎంతకష్టపడినా ఉపయోగం లేకపోయింది. కాంగ్రెస్ రెండో ఎన్నికలో కూడా ఓడిపోయిన తర్వాత దానికి కారణం చంద్రబాబే అనే ఆరోపణలు కూడా హస్తంపార్టీలో వినిపించాయి. సరే కారణాలు  ఏవైనా అప్పటినుండి చంద్రబాబు తెలంగాణా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా యాక్టివ్ అవ్వాలని అనుకోవటం వెనుక చాలా వ్యూహాలే ఉన్నాయి. వాటినే కవిత, హరీష్ ప్రస్తావిస్తున్నారు.చంద్రబాబు ఎంత ప్రయత్నించినా తెలంగాణాలో ఉనికి చాటుకోవటం కష్టమని కవిత తేల్చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజల్టు అయితే సేమ్ గానే ఉంటుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన రాజకీయాన్ని ఏపీకి మాత్రమే పరిమితం చేసుకుంటే బాగుంటుందని హరీష్ సూచించారు. చంద్రబాబు ఎప్పుడెప్పుడు తెలంగాణాలోకి అడుగుపెడతారా చుట్టూచేరి వాయించేద్దామ అని ఎదురు చూస్తున్నట్లుంది వీళ వరస. మొత్తానికి మొదటి సమావేశంతోనే బీఆర్ఎస్ నుండి గట్టి వ్యతిరేకత మొదలైంది. మరిన్ని సమావేశాలు పెట్టాలని అనుకుంటున్న చంద్రబాబుకు మరెన్ని వ్యతిరేకతలు ఎదురవుతాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: