అమరావతి : చంద్రబాబు హామీలను నమ్ముతారా ?

Vijaya


వచ్చేఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చితీరాలని చంద్రబాబునాయుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నంచేయటంలో ఎలాంటి తప్పులేదు. కాకపోతే తన ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఇపుడు చేస్తున్న హామీల అమలు విషయంలోనే జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబంటే జనాల్లో ఉన్న క్రెడిబులిటి అలాంటిది కాబట్టే. అవసరానికి ఎంతటి హామీని అయినా ఇచ్చేసి అవసరం తీరిపోగానే తెప్ప తగలేసే రకమనే అభిప్రాయం జనాల్లో బాగుంది.



వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇపుడు చంద్రబాబు పెద్దపెద్ద హామీలిస్తున్నారు. ఇప్పటికన్నా సంక్షేమపథకాలను మరింత మెరుగ్గా అమలుచేస్తారట. అప్పులు చేయకుండానే సంపదపెంచి సంక్షేమపథకాలను అమలుచేస్తానని చెబుతున్నారు. అలాగే బీసీలకు, మైనారిటీలకు చాలా హామీలిచ్చేస్తున్నారు. ప్రతిమండలానికి ఒక అన్నక్యాంటిన్ను ఏర్పాటుచేస్తారట. రైతులకు, డ్వాక్రా మహిళలను ఆదుకునేందుకు తనదగ్గర చాలా పథకాలున్నాయని చెబుతున్నారు. పరిశ్రమలను ఏర్పాటుచేసి నిరుద్యోగులను ఆదుకుంటారట.



ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇలాంటి హామీలనే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాగానే చాలా హామీలను తుంగలో తొక్కేశారు. ఒక్కహామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి. హామీల అమలులో ఇంతటి క్రెడిబులిటి సంపాదించుకున్న చంద్రబాబు మళ్ళీ ఇపుడు అలాంటి హామీలనే గుప్పిస్తున్నారు. చంద్రబాబు ఇపుడిస్తున్న హామీలను 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో జనాలు పోల్చిచూసుకుంటున్నారు.



ఇక్కడే చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. మరలాంటి చంద్రబాబు ఇస్తున్న హామీలను జనాలు ఇపుడు ఎలా నమ్ముతారు ? తన హయాంలో అమలుచేయాల్సిన పథకాలను కూడా అమలు చేయకుండా వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రైతురుణమాఫీ అమలులో ఫెయిలైన చంద్రబాబు దానికి జగన్ను బాధ్యుడిని చేస్తున్నారు. రైతు రుణమాఫీ అమలుచేయటంలో జగన్ ఫెయిలయ్యారని పదేపదే ఆరోపించటమే విచిత్రంగా ఉంది. కాపులను బీసీల్లో చేర్చటం, నిరుద్యోగభృతి, అన్నక్యాంటిన్ల ఏర్పాటులో చంద్రబాబు ఘోరంగా ఫెయిలై దానికి జగన్ను బాధ్యుడిని చేస్తే ఎవరైనా నమ్ముతారా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: