జగన్ పై నిప్పులు చెరిగిన అచ్చెన్నాయుడు?

Purushottham Vinay
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను ఉత్సవ విగ్రహాల్లా చేశారని ఆయన మండిపడ్డారు. చైర్మన్లు ఒక్క పైసా లాభం కల్పించకుండానే పదవీకాలం పూర్తిచేసుకున్నారని తెలిపారు. ఇక పదవి తీసుకున్నాక ప్రమాణ స్వీకారం ఇంకా ఇప్పుడు పదవీ విరమణ తప్ప ఈ రెండేళ్ల కాలంలో వారు చేసిందేమీ లేదని ఆయన పెదవి విరిచారు.ఇంకా బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేసే కార్పొరేషన్లకు సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకుండా కాళ్లు విరిచేశాడని అచ్చెన్నాయుడు విమర్శించడం జరిగింది.మొత్తం 56 మందిని బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించిన జగన్ రెడ్డి. వారి కోసం ఎంత కేటాయించారో చెప్పగలరా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.'బీసీలకు ఏంచేశారని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు ఇంకా దౌర్జన్యాలకు దిగుతున్నారు.అలాగే లెక్కలు అడిగితే కేసులు పెట్టి జైల్లో వేయిస్తున్నారు.


అసలు బీసీ సంక్షేమం అంటే ఇదేనా? ఇక ఇదేనా బీసీలకు స్వావలంబన కల్పించం అంటే? బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు అనేవి చేయకపోగా, 2018-19లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 70 వేల రుణాలను కూడా రద్దు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ ఇంకా అలాగే స్టడీ సర్కిల్స్ వంటి పథకాలు రద్దు చేసి బీసీ యువత భవిష్యత్తును కూడా నిర్వీర్యం చేశారు.ఇక బీసీలను అణచివేయడమే లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలకు తెరలేపారు.మొత్తం 26 మంది బీసీల్ని హత్య చేశారు. అలాగే 650 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. మొత్తం 2500 మందిపై దాడులకు పాల్పడ్డారు.ఇక బీసీ రిజర్వేషన్లను కుదించి మొత్తం 16,800 మందిని కూడా రాజ్యాధికారానికి దూరం చేసి బీసీలను నయవంచన చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డీ. నీ దాష్టీకాలకు ఘోరీ కట్టేందుకు బీసీలు ఏకమయ్యారు అని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని బీసీలంతా కూడా ఏకమై బంగాళాఖాతంలో నిన్ను పడేయడం ఖాయమని గుర్తుంచుకో అంటూ అచ్చెన్నాయుడు జగన్ పై నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: