వేప చెట్లు ఎండిపోవడానికి.. కారణం అదేనట.. నిజం చెప్పిన సైంటిస్టులు?

praveen
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక మనిషి ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక చుట్టుపక్కల ఎక్కడ ఏం జరిగినా కూడా అది కరోనా వైరస్ వల్లే జరిగిందేమో అనే భయం ప్రతి ఒక్కరిలో నిండిపోయింది. ఈ క్రమంలోనే మనుషుల దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న జీవరాసులు చివరికి చెట్ల వరకు కూడా వేటికి ఏం జరిగినా కూడా అది కేవలం కరోనా వైరస్ ప్రభావం  అని ఎంతోమంది భావిస్తూ ఉన్నారు. అయితే వైరస్ పై ఇటీవల కాలంలో జనాల్లో పూర్తిస్థాయి అవగాహన వచ్చినప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఇంకా ఎన్నో అపోహలను నమ్ముతూనే ఉన్నారు అని చెప్పాలి.

 ఇలా నమ్ముతున్న వాటిలో అటు వేప చెట్లు ఎండిపోవడం కూడా ఒకటి ఉంది అని చెప్పాలి. ఏకంగా కరోనా వైరస్ కారణంగానే వేప చెట్లు ఎండిపోతున్నాయని గ్రామాల్లో ఉండే ఎంతో మంది ప్రజలు అపోహలకు పోయారు. ఇక ఇలా ఎండిపోతున్న వేప చెట్ల కింద కూర్చోవడానికి కూడా భయపడిపోయారు. అయితే గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేప చెట్లు ఇలా ఎండిపోతూ ఉండడం హాట్ టాపిక్గా మారగా.. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించెందుకు దీనిపై శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. వేప కొమ్మలు ఎండిపోవడానికి అసలు కారణం ఏంటి అన్న విషయాన్ని నిజం నిగ్గు తేల్చారు శాస్త్రవేత్తలు.

 కొమ్ములు ఎండిపోవడానికి తెగుళ్లు కారణం అంటూ ములుగు ఫారెస్ట్ అండ్ రీసెర్చ్ సైంటిస్టులు నిర్ధారించారు. తెగులకు ఫోమోప్పిస్  ఆజాడిరక్ట కారణం అంటూ తెలిపారు. డై బ్యాక్ అనే పిలిచే వ్యాధి కారణంగానే వేప చెట్లు ఇక ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి అంటూ తెలిపాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎంతోమంది ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పాలి. అయితే కొంతమంది జనాలు మాత్రం శాస్త్రవేత్తలు ఎంత చెప్పినా తాము అనుకుంటుందే నిజం అని భావిస్తూ ఇక వేప ఎండిపోవడాన్ని అనర్థంగా భావిస్తూ ఎన్నో అపోహలకు పోతున్నారుఅని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: