హైదరాబాద్ : కేసీయార్ ను జనాలు యాక్సెప్ట్ చేస్తారా ?

Vijayaజాతీయపార్టీగా మారిన బీఆర్ఎస్ తరపున వచ్చేఎన్నికల్లో  ఏపీలో కూడా పోటీచేయాలని కేసీయార్ డిసైడ్ అయినట్లున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో ముందు ఒక ఆఫీసు తెరుస్తున్నారు. ఈఆపీసు కేంద్రంగా ఏపీలో రాజకీయాలు చేయాలని కేసీయార్ అనుకుంటున్నారు. ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని, కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలని నిర్ణయించుకోవటం కేసీయార్ చేతిలోని పనేకాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఓట్లేయటం, ఆదరించటం జనాలిష్టం.ఇప్పటి పరిస్ధితులను బట్టిచూస్తే బీఆర్ఎస్ ను ఏపీ జనాలు ఆదరించటం అనుమానమే. ఎందుకంటే విభజనకు కేసీయారే కారణమనే మంట ఏపీ జనాల్లో ఇంకాఉంది. అలాగే అడ్డుగోలు విభజన చేయించారనే కోపం కేసీయార్ పైనుంది. విభజన విషయాన్ని పక్కనపెడితే తన అవసరం కోసం రెండు ఎన్నికల్లో సీమాంధ్రుల మీద కేసీయార్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, తిట్టిన బూతులను ఏపీ జనాలు ఇప్పటికీ మరచిపోలేకుండా ఉన్నారు.సీమాంధ్రులను తిడితే, తెలంగాణా సెంటిమెంటును రెచ్చగొడితే తెలంగాణాలో ఓట్లుపడతాయని అనుకునే నోటికొచ్చినట్లు మాట్లాడారు. మొన్నటికి మొన్న కూడా తెలంగాణా మంత్రులు ఏపీ గురించి చాలా అసభ్యంగా మాట్లాడారు. తెలంగాణా గొప్పదనాన్ని చెప్పుకోవటం కోసం ఇప్పటికీ ఏపీని చులకనగానే మాట్లాడుతున్నారు. అలాంటిది బీఆర్ఎస్ కు జాతీయపార్టీ గుర్తింపురావాలంటే ఇతర రాష్ట్రాల్లో కూడా  ఓట్లు, సీట్లు చాలా అవసరం. అందుకనే కర్నాటక, ఏపీలో ఆఫీసులు ఓపెన్ చేసి ఎన్నికల్లో పోటీకి రెడీ అయిపోతున్నారు.ఈ నేపధ్యంలోనే కేసీయార్ ను ఏపీ జనాలు ఆదరించేంది అనుమానంగానే ఉంది. ఎవరో ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ కు మద్దతుగా హోర్డింగులు పెట్టినంత మాత్రాన కేసీయార్ కు ఏపీలో కూడా విపరీతమైన క్రేజ్ ఉందని అనుకునేందుకు లేదు. కాకపోతే బీఆర్ఎస్ కు అర్జంటుగా సీట్లు రాకపోయినా పర్వాలేదు ముందు ఓట్లు కావాలి. అందుకనే బయటరాష్ట్రాల్లో కూడా పోటీకి రెడీ అయిపోతున్నారు. మరి కేసీయార్ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందనేది అనుమానమే. ఇపుడు హోర్డింగులు పెట్టిన వాళ్ళెవరు బీఆర్ఎస్ కు ఓట్లేయించేంత సత్తా ఉన్నవాళ్ళు కాదు. మరి చివరకు బీఆర్ఎస్ ఎంట్రీ ఎలాగుంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: