అమరావతి : మార్గదర్శి గట్టిగా ఇరుక్కున్నట్లేనా ?

Vijaya




ప్రాధమిక తనిఖీల్లో భారీగా అవకతవకలను గుర్తించిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ను ప్రభుత్వం వదిలిపెట్టేట్లు లేదు. తొందరలోనే మార్గదర్శి హెడ్ ఆఫీసుకు వెళ్ళేందుకు ఆడిటర్లు, ఫెరెన్సిక్ ఆడిట్ నిపుణులు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ చెప్పారు. మార్గదర్శిలో తాము తనిఖీలు చేసినపుడు అక్కడి సిబ్బంది తామడిగిన సమాచారం ఇవ్వకుండా, ఫైల్స్ చూపించకుండా, సిబ్బంది సహాయ నిరాకరణ చేసిన విషయాన్ని ఐజీ గుర్తుచేశారు.



తనిఖీల్లో తమకు సహకరించకుండా తమిష్టం వచ్చినట్లు పెద్ద ప్రకటనలు ఇచ్చుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తమకు మద్దతుగా తమ పత్రికలో  ప్రకటనలు ఇచ్చుకుంటే చేసిన తప్పులు ఒప్పులైపోతాయా అని రామోజీరావును సూటిగా ప్రశ్నించారు. చిట్ ఫండ్ కంపెనీ పేరుతో వసూలు చేస్తున్న వేల కోట్లరూపాయలను యాజమాన్యం తమిష్టం వచ్చినట్లుగా దారిమళ్ళిస్తున్న విషయం స్పష్టంగా బయటపడిందన్నారు. వాళ్ళ బండారం బయటపడుతుందన్న భయంతోనే సిబ్బందిని తమకు సహకరించవద్దని మ్యానేజ్మెంట్ ఆదేశించిందన్నారు.



తాము జరిపిన దాడుల్లో 35 చిట్ ఫండ్ కంపెనీల్లో అక్రమాలు, అవకతవకలు జరిగిన విషయాన్ని గుర్తించామన్నారు. అందరికీ నోటీసులిస్తే మార్గదర్శి తప్ప మిగిలిన యాజమాన్యాలు తమకు సహకిస్తున్నట్లు రామకృష్ణ చెప్పారు. మార్గదర్శి ఎక్కడ వ్యాపారం చేసినా  అక్కడి వ్యవహారాలను, లావాదేవీలను కచ్చితంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే అన్నారు. చిట్ ఫండ్స్ ద్వారా వసూలుచేసిన కోట్లరూపాయలను ఉషోదయ ఎంటర్ ప్రైజెస్, ఫిల్మ్ సిటీ లాంటి వాటి నిర్వహణకు మళ్ళించినట్లు తాము అనుమానిస్తున్నట్లు చెప్పారు.



ఇక్కడ గమనించాల్సిందేమంటే రామోజీ గ్రూపు సంస్ధల్లో చాలావాటికి సరైన ఆదాయాలు లేవనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే వివిధ భాషల్లోని ఛానళ్ళని అమ్మేసి, రెండు పత్రికలను మూసేసింది. అలాగే సిబ్బందిని కూడా వీలైనంతగా తగ్గించేస్తోందనే ప్రచారం జరుగుతోంది.  రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువగా ఉందట. అంటే వీటన్నింటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా మాత్రమే నిధులు అందుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి తొందరలో జరగబోయే ఫోరెన్సిక్ ఆడిట్ లో ఏ విషయాలు బయటపడతాయో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: