ఢిల్లీ : కాంగ్రెస్ ను ఆప్ ఇంత దెబ్బకొట్టిందా ?

Vijaya


గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు, అంచనాల్లో బయటపడింది. అయితే కాంగ్రెస్ మరీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని చాలామంది నమ్మలేదు. కానీ ఫలితాలను చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంత ఘోరంగా ఓడిపోవటానికి కారణాలు ఏమిటనే విషయమై విశ్లేషణలు మొదలయ్యాయి.



అయితే గుజరాత్ లో బీజేపీకి ఇంతటి ఘన విజయం దక్కిందన్నా కాంగ్రెస్ ఓడిపోయిందన్నా కారణం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనే చెబుతున్నారు. కాంగ్రెస్ ఘోర ఓటమికి ఆప్ ఏ విధంగా కారణమైంది ? కారణం ఏమిటంటే గుజరాత్ లో మొదటిసారి ఆప్ పోటీచేసింది. మొదటిసారి పోటీలోనే దాదాపు 60 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లను సాధించినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా మాటలే చెప్పారు కానీ జనాలు నమ్మలేదు.



అయితే ఓట్లను చీల్చటం ఖాయమని అందరు అనుకున్నదే. కాకపోతే ఓట్లను చీల్చటం అన్నది  ఉల్టాగా జరిగింది. అధికార బీజేపీ ఓట్లను చీల్చుతుందని అది కాంగ్రెస్ కు లాభం జరుగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ జరిగిందేమిటంటే ఆప్ అభ్యర్ధులు సుమారు 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల ఓట్లనే చీల్చినట్లు అర్ధమవుతోంది. దీని ఫలితంగానే బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యే జరిగుంటే పరిస్ధితి ఎలాగుండేదో తెలీదు.



కానీ మధ్యలో ఆప్ కూడా ఉండటం వల్ల కాంగ్రెస్ ఓట్లే చీలిపోయి బీజేపీ లాభపడింది. సుమారు 19 శాతం ఓట్లను ఆప్ చీల్చుకున్నట్లు లెక్కలు కడుతున్నారు. ఇవన్నీ కూడా పర్టిక్యులర్ గా మైనారిటి, ఎస్సీ, ఎస్టీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీవేనని విశ్లేషకులంటున్నారు. సో ఫలితాలను బట్టిచూస్తే కాంగ్రెస్ గెలుపు మీద ఆప్ దెబ్బ చాలా గట్టిగానే పడినట్లు అర్ధమవుతోంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆప్ దృష్టిపెట్టకపోవటం వల్లే అక్కడ బలంగా ఉండి బీజేపీని ఓడించింది. అక్కడ కూడా ఆప్ గట్టిగా పోటీలో ఉండుంటే అక్కడ ఏమయ్యేదో ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: