ఢిల్లీ : మోడీ దృష్టిలో పవన్ వాల్యూ ఇంతేనా ?

Vijayaబీజేపీకి మిత్రపక్షం అధినేతంటారు. సినిమాల్లో పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు. అలాంటి పవన్ కల్యాణ్ కు నరేంద్రమోడీ ఇచ్చే వాల్యూ ఎంతో తాజాగా బయటపడింది.  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు స్వయంగా మోడీయే ఫోన్ చేసి పదినిముషాలు మాట్లాడారు. దీంతోనే పవన్ కున్న వాల్యు ఏమిటో తేలిపోయింది. నాలుగురోజులక్రితం నర్సంపేటలో షర్మిల  పాదయాత్ర చేస్తుంటే టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. కొన్ని వెహికల్స్ ను ధ్వంసంచేసేశారు. షర్మిల ప్రయాణంచేస్తున్న వెహికల్ కు టీఆర్ఎస్ శ్రేణులు నిప్పుపెట్టాయి.దాడిలో ధ్వసంమైన ఒక వెహికల్లో  మరుసటిరోజు షర్మిల ప్రగతిభవన్ కు బయలుదేరారు. సోమాజీగూడలో అడ్డుకున్న పోలీసులు షర్మిలను వెనక్కు వెళ్ళిపోవాలన్నారు. అయితే షర్మిల వెనక్కు వెళ్ళలేదు అలాగని వాహనం నుండీ దిగలేదు. దాంతో  వాహనంతో పాటు షర్మిలను కూడా టాయింగ్ వెహికల్ ద్వారా పోలీసుస్టేషన్ కు తీసుకెళ్ళారు. ఆ వీడియోలు, ఫోటోలు మీడియాతో పాటు  సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఆ విషయమై మాట్లాడేందుకే షర్మిలకు మోడీ ఫోన్ చేశారు. సుమారు వాళ్ళిద్దరు పదినిముషాలు మాట్లాడుకున్నారు. తనకు ఫోన్ చేసి పరామర్శించిన మోడీకి షర్మిల ధన్యవాదాలు కూడా చెప్పారు. సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇపుడందరు పవన్ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం వైజాగ్ పర్యటనకు వెళ్ళిన పవన్ రెండురోజులు హోటల్ కే పరిమితమైపోవాల్సొచ్చింది.అనుమతిలేకుండా ర్యాలీ చేశారన్న కారణంతో పోలీసులు పవన్ను హోటల్ కే పరిమితం చేసేశారు. దాదాపు ఒకటిన్నర రోజు హోటల్లోనే ఉండిపోయారు. అప్పుడు కూడా పవన్ ఘటనను మీడియా బాగా హైలైట్ చేసింది. అయితే అప్పుడు పవన్ కు మోడీ ఫోన్ చేసి మాట్లాడలేదు. ఆ తర్వాతెప్పుడో వైజాగ్ వచ్చిన మోడీని పవన్ కలిశారు. తనంతట తానుగా పవన్ ఘటనను ప్రస్తావించి తన పరిస్ధితిని చెప్పుకోవాల్సొచ్చింది. తనకంతా తెలుసని మోడీ సింపుల్ గా తేల్చేసి విషయాన్ని పక్కనపడేశారు. పవన్-షర్మిల విషయాలపై నెటిజన్లు పోలిక చూపుతు పవన్ కు మోడీ ఇచ్చే వాల్యు ఏమిటో తేలిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.  
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: