గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అదరగొట్టిన మోడీ?

Purushottham Vinay
ఇక అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వడం జరిగింది. డిసెంబర్ 8న (గురువారం) ఎన్నికల ఫలితాలు తెలియనున్నాయి.మొత్తం 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి.. మొదటి విడతలో మొత్తం 89 స్థానాల్లో ఓటింగ్ జరగగా..93 స్థానాల్లో ఈ రోజు పోలింగ్‌ పూర్తవ్వడం జరిగింది.గుజరాత్‌ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోరు అనేది నెలకొంది. బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం సొంతంచేసుకునేందుకు చాలా తీవ్రంగా కష్టపడింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ప్రచారం చెయ్యడంతో.. బీజేపీ మరోసారి గుజరాత్ పీఠాన్ని కైవసం చేసుకోనుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. గుజరాత్‌లో నరేంద్ర మోడీ హవానే కొనసాగిందని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలో తెలిసింది. గుజరాత్‌ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎప్పటిలాగే నరేంద్ర మోదీ హవా కొనసాగింది. పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7 ఇంకా అలాగే ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.


ఇక బీజేపీ భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని.. ఇన్ని సీట్లు రావడానికి ప్రధాని మోదీ హవానే కారణమంటూ పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది. బిజెపి-కాంగ్రెస్‌ మధ్య ఓట్ల వ్యత్యాసం మొత్తం 21 శాతంగా ఉంటుందని పేర్కొంది. బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 25 శాతం ఇంకా ఆమ్‌ ఆద్మీ పార్టీకి 16 శాతం ఇంకా అలాగే ఇతరులకు 13 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ± 3 శాతంగా ఉంటుందని పేర్కొనడం జరిగింది. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే మొత్తం కూడా 92 సీట్లు గెలవాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం అయినందు వలన , ఎప్పటిలాగే ఆయన సెంటిమెంట్ బీజేపీకి లాభం చేకూర్చింది. ఈ సారి గుజరాత్ రాష్ట్రంలో దాదాపు 30 బహిరంగ సభల్లో నరేంద్ర మోదీ పాల్గొనడం ఇంకా అలాగే వరసగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అమిత్ షా క్షేత్రస్థాయిలో ఉండి వ్యుహాలు రచించడం వల్ల గుజరాత్లో బీజేపీ తన పట్టు నిలుపుకోగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: