సూపర్ బ్రో.. రెస్టారెంట్ కి భలే పేరు పెట్టావ్?

praveen
ఇటీవల కాలంలో ఎంతో మంది యువత ఒకరి కింద పని చేయడం కంటే ఇక సొంత బిజినెస్ పెట్టుకోవడమే మేలు అనే విధంగా వినూత్నంగా ఆలోచిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద చదువులు చదివినప్పటికీ ఏదో ఒక సొంత బిజినెస్ ఉంటే బాగుంటుందని భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ కూడా స్వయం ఉపాధి వైపు అడుగులు వేశారు అని చెప్పాలి. అయితే బిజినెస్ ప్రారంభించాలి అంటే డబ్బులు ఎంత అవసరమో తెలివితేటలు కూడా అంతే ఉండాలి.

 ఇక కొత్త బిజినెస్ వైపు కస్టమర్లు అందరికి దృష్టిని ఆకర్షించేలా మిగతా వాళ్లతో పోల్చి చూస్తే వినూత్నంగా ఆలోచించాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పటి కాలంలో ఇలా తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు.. ఇక రెస్టారెంట్ ఏకంగా పాపులారిటీ సంపాదించేందుకు కొన్ని రెస్టారెంట్లా నిర్వాహకులు ఎన్నో ఆకర్షనీయమైన ఆఫర్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఇక ఇప్పుడు ఒక వ్యక్తి తన బిజినెస్ ను పుంజుకునేలా చేయడం కోసం చేసిన ఆలోచన మాత్రం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.

 ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన గౌరవ్ పార్ట్వ అనే వ్యక్తి తన రెస్టారెంట్ కు ప్రేమికులు ప్రేమగా.. తిన్నావా రా ( మేలే బాబు నే తానా థాయ) అని అర్థం వచ్చే విధంగా పేరును పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అతని రెస్టారెంట్ తక్కువ సమయంలోనే చుట్టుపక్కల ఎంతో ఫేమస్ అయ్యింది అని చెప్పాలి. దీంతో ఆ రెస్టారెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా.. ఇక అతను వినూత్నంగా ఆలోచించి రెస్టారెంట్ పేరు పెట్టిన విధానం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: