ఏపీని వీడని వర్షాలు..మరో అల్పపీడనం వచ్చే ఛాన్స్..

Satvika
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. ఇంకా జల దిగ్బంధం నుంచి బయట పడలేదు.. కానీ, మళ్ళీ మళ్ళీ వర్షాలు పడుతున్నాయి.. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తునె ఉన్నాయి.. కొన్ని ప్రాంతాలలో వర్షాల వల్ల ఎన్నో నష్టాలు కలిగాయి.. అయిన గ్యాప్ లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి..

ఇప్పుడు మరో బాంబ్ లాంటి వార్తను వింటున్నారు.. ఈలోపే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి..క్రమంగా బలపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

కాగా, విశాఖతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో శుక్రవారం చెదురుమదురు జల్లులు పడ్డాయి. సామర్లకోట, బాపట్ల ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. ఇక విజయవాడలో ఆకాశం మేఘావృతం అయి ఉంది. సిటీలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది..అదే విధంగా..దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం.. శుక్రవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: