చంద్రబాబు చేతిలో "సర్వే రిపోర్ట్"... వణుకుతున్న మాజీలు !

VAMSI
ప్రస్తుతం చంద్రబాబుకు మనసులో ఒకే ఒక్క విషయం తీవ్రంగా కలచివేస్తోంది, అధికారంలో జగన్ ఉండడం అతనికి నచ్చడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపి మళ్ళీ యధావిధిగా టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం కావాలని పట్టుదలతో పని చేస్తున్నారు. ఈసారి కొంచెం జగన్ స్టైల్ లోనే డిఫెరెంట్ ప్లాన్ తో ఎన్నికలకు వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నారు. అందులో మొదటిది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ ఎమ్మెల్యే కు ఆదరణ ఉంది అన్న పలు అంశాలను సర్వే చేయించి... దానిని పరిగణలోకి తీసుకుని టికెట్ లు ఇవ్వడానికి పూనుకున్నారు.
వాస్తవంగా ఇది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గెలుపు దక్కే నాయకులకే టికెట్ లు ఇవ్వడమే మంచి వ్యూహం అని చెప్పాలి. సర్వే రిపోర్ట్ ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉంది, ఇక టికెట్ లు కేటాయించడమే మిగిలింది, ఇప్పటికే కొన్ని చోట్ల క్యాండిడేట్ లను ఎంపిక చేశారు. ఇక టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు టికెట్ ఇచ్చే వారు ప్రజల్లో ఆదరణ, ఎన్నికల్లో ఎంతకైనా ఖర్చు పెట్టే స్థోమత మరియు వెనుక మంచి భుజబలం కూడా ఉండే వారిని ఏరికోరి మరీ టికెట్ లు ఇవ్వడానికి చూస్తున్నారట. ఈ సర్వే ప్రకారం పార్టీకి అండదండగా ఉండి, కీలకంగా వ్యవహరించిన చాలా అమందికి నిరాశ తప్పేలా లేదట.
అంతే కాకుండా టీడీపీ నుండి పోటీ చేసే వారిలో చాలా వరకు కొత్త ముఖాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి చంద్రన్న ఎమ్మెల్యే పోటీదారులను సెలెక్ట్ చేయనున్నారట. ఎందుకంటే ఈ ఎన్నిక తనకు మరియు పార్టీకి చాలా కీలకం కావడం వలన ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదన్నది టీడీపీ అధిష్టానం నుండి వినబడుతున్న మాట. మరి చంద్రబాబు తీసుకుంటున్న ఈ కొత్త మరియు సంచలన నిర్ణయాలు ఏ మేరకు ఫలిస్తాయి అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: