మాజీ మంత్రికి చుక్కెదురు...ఎమ్మెల్యే సీటు కోసం పాట్లు ?

VAMSI
గతంలో రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది. కర్నూల్ జిల్లాకు చెందిన ఆళ్లగడ్డ మరియు నంద్యాల ఎమ్మెల్యే నియోజకవర్గాలలో భూమా నాగిరెడ్డి మరియు భూమా శోభా నాగి రెడ్డి ఫ్యామిలీ దే హవా అంతా.. వీరు మొదటి నుండి కూడా టీడీపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి చాలా సక్సెస్ అయ్యారు. కానీ హఠాత్తుగా వారిద్దరూ చనిపోవడంతో కర్నూల్ జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. అయితే అప్పుడే భూమా ఫ్యామిలీకి చెందిన భూమా అఖిలప్రియ మీద నమ్మకంతో ఆనాటి సీఎం చంద్రబాబునాయుడు మంత్రిని చేశాడు.
అయితే భూమా అఖిలప్రియ ఈ అవకాశాన్ని సరిగా వాడుకోవడంలో విఫలం అయిందని తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరం మాత్రమే సమయం ఉంది. దీనితో చంద్రబాబు  క్యాడర్ ను అలెర్ట్ చేసుకుంటూ ఎమ్మెల్యే సీట్ లను కూడా కేటాయించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అందులో భాగంగానే ఇటీవల కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చాడు చంద్రబాబు. అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి పోటీ చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు శ్రీశైలం నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు, కానీ పక్కనే ఉన్న ఆళ్లగడ్డకు మాత్రం ఎవరినీ ఖరారు చేయకపోవడం విశేషం.
ఇక స్వయంగా అఖిలప్రియనే నాకు ఆ సీటు కావాలని అడిగినా బాబోరు పట్టించుకోలేదట. దీనితో అఖిలప్రియకు నియోజకవర్గంలో ఏర్పడిన మైనస్ ల కారణంగానే ఆమెకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు వెనుకాడుతున్నారట. అయితే ఈమెకు సొంత పార్టీలోనే విలువ లేకపోవడానికి కారణం జైలుకు వెళ్లడం , ఏసీ సుబ్బారెడ్డితో గొడవలు పడడం , అధిష్ఠానముతో సంప్రదించకుండా సొంత వ్యూహాలు చేసుకోవడం , నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సరిగా ఉండకపోవడం వంటివి ఉన్నాయి. అస్సలు చంద్రబాబు అఖిలప్రియకు ఎమ్మెల్యే సీటు ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: