చంద్రబాబుకు 2024 ఎన్నికలంటే అందుకే భయమేస్తోందా ?

VAMSI
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పత్తికొండ , నంద్యాల మరియు కొడుమూరు నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ పర్యటనలో చంద్రబాబు బాగా ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా అసెంబ్లీ లో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడ్డారు. ఆయన మాటా మాట మీద మీరు కనుక నన్ను వచ్చే ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపకపోతే... ఇవే నాకు చివరి ఎన్నికలు అవుతాయని భావోద్వేగానికి లోనయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ విధమైన కామెంట్స్ చేయడం పట్ల టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు.
రాజకీయ విశ్లేషకులు ఎందరో రాజకీయ నాయకులకు రోల్ మోడల్ గా నిలిచిన చంద్రబాబు నుండి ఈ రకమైన కామెంట్స్ అస్సలు ఊహించలేదని అవాక్కవుతున్నారు. అసలు ఎందుకు చంద్రబాబుకు 2024 ఎన్నికలంటే అంత భయం అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రాబుకు గెలుస్తాము అన్న నమ్మకం కాసింత అయినా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబులో ఈ భయం కలగడానికి కారణం సెకండ్ లెవెల్ క్యాడర్ అన్నది స్పష్టంగా అర్ధమవుతోంది. 2019 లో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు అంతా ఢీలా పడిపోయారు. చంద్రబాబు సైతం ఏపీలో మొహం చెల్లక తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఎలాగోలా నెమ్మదిగా వైసీపీ ప్రభుత్వం యొక్క అవకతవకలను ప్రజల ముందుకు తీసుకెల్తూ విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా వైసీపీ పాలన ముందు టీడీపీ పాచికలు పారడం లేదన్నది వాస్తవం. పూర్తిగా టీడీపీకి ఆదరణ తగ్గడానికి కారణం కింది స్థాయి నాయకులే. పార్టీ ఓడిపోయాక ఎవరికి వారు రాజకీయ భవిష్యత్తు గురించి అలోచించి జుంపింగ్ ల గురించి ప్లాన్ చేసుకున్నారు తప్ప... పార్టీని బలపరచాలని మాత్రం ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగాయని చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు లో 2024 ఎన్నికలు అంటే ఓటమి భయం కలగడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే మరియు ఎంపీలుగా గెలిచి ఓడిన వారే... !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: