ఎల్ఐసీలో కొత్త పాలసీ..జీవితకాలం పెన్షన్..

Satvika
ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.ఇప్పటివరకు లాభాలను అందిస్తూ వస్తున్నాయి.ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఎల్‌ఐసి పాలసీలపై ప్రజలు విశ్వాసంతో ఉంటారు.న్యూ జీవన్ శాంతి పేరిట పెన్షన్ లింక్డ్ బీమాతో ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పాలసీలో ఒక్కసారి పెట్టుబడి పెడితే..జీవితాంతం పెన్షన్ అందుకునే అవకాశముంది. వృద్ధాప్యంలో ఖర్చుల కోసం ఆలోచించేవారికి ఈ బీమా మంచి ఎంపిక అవుతుంది. పెద్ద వయసులో జీవితానికి భద్రత కల్పించే మంచి పథకంగా దీనిని చెప్పుకోవచ్చు.

ఒక్కసారే పెట్టుబడి పెడితే జీవితమంతా పెన్షన్ గ్యారంటీ లభిస్తుంది. ఈ పథకం ఎల్ఐసీకు చెందిన పాత జీవన్ పాలసీ వంటిదే. జీవన్ శాంతి పాలసీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది తక్షణ ఎన్యుటీ కాగా రెండవది డిఫర్డ్ ఎన్యుటీ. ఇదొక సింగిల్ ప్రీమియం ప్లాన్. తక్షణ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ సౌలభ్యం లభిస్తుంది. ఇక రెండవ డిఫర్డ్ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న తరువాత అంటే 5,10,15 లేదా 20 ఏళ్ల తరువాత పెన్షన్ సౌలభ్యం లభిస్తుంది.

ఈ పాలసీలో పెన్షన్ గ్యారంటీ ఉంటుంది. పెట్టుబడి, వయస్సు, డిఫర్మెంట్ పీరియడ్ ప్రకారం పెన్షన్ ఎంతనేది వర్తిస్తుంది. పెట్టుబడి,పెన్షన్ ప్రారంభానికి మధ్య కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంది లేదా వయస్సు ఎంత ఎక్కువగా ఉందో పెన్షన్ కూడా అంతే లభిస్తుంది.ఇందు కోసం కనీస వయస్సు 30 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 85 ఏళ్లుగా ఉంది. అంతేకాకుండా జీవన్ శాంతి పాలసీలో రుణం, పెన్షన్ ప్రారంభమైన ఒక ఏడాది తరువాత దీన్ని సరెండర్ చేయవచ్చు. పెన్షన్ ప్రారంభమైన 3 నెలల తరువాత అందించవచ్చు. రెండు ఆప్షన్లలో పాలసీ తీసుకునేటప్పుడు ఏడాది వడ్డీ గ్యారంటీ ఉంటుంది.ఈ పాలసీ కోసం ఆన్‌లైన్, ఆఫ్లైన్ లో కూడా అప్లై చెయ్యొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: