ఆ రెండు గవర్నమెంట్ స్కీమ్ ల వల్ల ప్రయోజనాలు..

Satvika
ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది.కేంద్ర ప్రభుత్వం.. అందులో కొన్ని పథకాలు ప్రజల అవసరాలకు సరిపొయాయి.ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం.. మీ పిల్లల, కుటుంబ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం లేదా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మీరు వివిధ పొదుపు పథకాలు గురించి ఆలోచించడం మంచిది.ఇందులో భాగంగా పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి రాబడిని పొందవచ్చు. సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) రెండింటి లోనూ మంచి రాబడిని పొందవచ్చు. మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం గా ఉంటుంది. అయితే ఈ రెండు పథకాల్లో ఏది బెటర్ అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది.

మీరు పీపీఎఫ్‌ లో ఏ పేరు తో నైనా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ సుకన్య సమృద్ధి యోజనలో మీరు మీ ఆడ పిల్ల పేరుపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. ఇది వివాహం సమయంలో, చదువుల నిమిత్తం సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది.ఇకపోతే స్కీమ్‌లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో సుకన్య సమృద్ధి యోజన మంచిదని మీరు భావిస్తుంటారు. కానీ మీరు రెండు పథకాలలో పెట్టుబడి పెట్టాలి. పీపీఎఫ్‌ లో తక్కువ వడ్డీ లభిస్తున్నప్పటికీ, తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి...

సుకన్య సమృద్ధి యోజన లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం. దీనికి పీపీఎఫ్ కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి కారణం ఇదే. ఈ పథకంలో మీరు కుమార్తె వయస్సు 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు..అన్నీ అవసరాలకు సరిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: