రావతి : పవన్, చంద్రబాబు దారికొచ్చినట్లేనా ?

Vijaya




అమ



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి దారికి వచ్చేసినట్లే అనుకోవాలి. ఒకపుడు చంద్రబాబు, తాజాగా పవన్ మాట్లాడుతు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమపథకాన్ని కూడా రద్దు చేయమంటు చెప్పారు. విజయనగరంజిల్లా పర్యటనలో పవన్ మాట్లాడుతు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలను రద్దుచేసే ఆలోచనేదీ తనకు లేదని ప్రకటించారు. పథకాల అమలును ఇప్పటికన్నా ఇంకా మెరుగ్గా అమలుచేస్తామని కూడా హామీ ఇచ్చారు.




కొద్దినెలల క్రితం చంద్రబాబుకూడా జనాలకు ఇలాంటి హామీనే ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమపథకాన్నీ ఆపనంటు హామీఇచ్చారు. ఇపుడు అమలవుతున్న పథకాలన్నీ కంటిన్యు అవుతాయన్నారు. సీన్ కట్ చేస్తే ఒకపుడు ఇదే చంద్రబాబు, ఇదే పవన్ ఏమని గోలచేశారు ? జగన్ ఏపీని మరో శ్రీలంక లాగ తయారుచేసినట్లు గోలగోల చేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది. సంక్షేమపథకాల రూపంలో జగన్ ఆదాయాన్ని పప్పుబెల్లాల రూపంలో జనాలకు పంచేస్తున్నారని మండిపడ్డారు.



జగన్ చేతకాని పాలన కారణంగా ఏపీ తొందరలోనే శ్రీలంకలాగ అయిపోవటం ఖాయమన్నారు. ఆ పరిస్దితి రాకుండా ఉండాలంటే వెంటనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని ఎంత గోలచేశారు. వీళ్ళు గోలచేయటమే కాకుండా చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వారితోను, ఆర్ధికరంగం నిపుణులతో కూడా ఎల్లోమీడియాలో కథనాలు రాయించారు. అలాగే ఎల్లోమీడియాతో చేయించిన గోలకైతే అంతేలేదు.



అలాంటిది రోజుల వ్యవధిలోనే తాము కూడా సంక్షేమపథకాలను అమలుచేస్తామని, ఏ ఒక్క పథకాన్ని నిలిపేదే లేదని ఎందుకు చెబుతున్నట్లు ? ఎందుకంటే తమ ప్రకటనల కారణంగా సంక్షేమపథకాల లబ్దిదారుల్లో భయం మొదలైనట్లు గ్రహించారేమో. చంద్రబాబు/ పవన్ అధికారంలోకి వస్తే సంక్షేమపథకాలను ఆపేస్తారేమో అనే భయం లబ్దిదారుల్లో మొదలైంది. లబ్దిదారుల మనోగతం అర్ధమవ్వటంతోనే చంద్రబాబు, పవన్ ప్లేటు ఫిరాయించారు. మొత్తానికి చంద్రబాబు, పవన్ ఇద్దరు కూడా జగన్ రూటులోకి వచ్చేశారని జనాలందరికీ అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: