ఉత్తరాంధ్ర : ఏపీలో బీజేపీ పరిస్ధితి మోడీకి అర్ధమైపోయిందా ?

Vijaya



‘ఒకపుడు గుజరాత్, కర్నాటక, ఏపీలో పార్టీ పరిస్ధితి ఒకేలాగుండేది...ఆ రెండురాష్ట్రాల్లో పార్టీ ఇపుడు బాగా పటిష్టంగా ఉంది..ఏపీలో పరిస్ధితే ఏమీ బావోలేదు’..ఇవి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు. పార్టీ కోర్ కమిటి సమావేశం దాదాపు గంటన్నరసేపు జరిగింది. పార్టీ చీఫ్ సోమువీర్రాజుతో పాటు మరికొందరు నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టానికి నేతలు తీసుకుంటున్న చర్యలను మోడీ అడిగి తెలుసుకున్నారు.



పార్టీనేతలతో జరిగిన చర్చల్లోనే మోడీ పార్టీ పరిస్ధితిపై పై వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరిస్ధితిపై మోడీచేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూలేదు. అయితే అందుకు కారణం ఎవరు ? అనేది కీలకమైన పాయింట్. దశాబ్దాలుగా పార్టీబలోపేతం కాకపోవటమే కాకుండా మరింత బలహీనమైనపోవటానికి మొన్నటి వరకు అత్యున్నతస్ధాయిలో పదవి వెలగపెట్టిన నేతే కారణమని అందరికీ తెలుసు. ప్రత్యర్ధిపార్టీ అధినేతతో ఉన్న గట్టి బంధం కారణంగా సొంతంపార్టీ ఎదుగుదలను సైతం సదరు కీలకనేత బలిచ్చేశారు.



తెలుగుదేశంపార్టీకి బీజేపీ ఒకపుడు తోకపార్టీగా ప్రచారంలో ఉండేదంటే అందుకు సదరు కీలకనేతే కారణమని ఇప్పటికీ పార్టీలోని చాలామంది చెప్పుకుంటారు. ఈ విషయం నరేంద్రమోడీకి అర్ధమవ్వటంతోనే క్రియాశీల రాజకీయాలనుండి బలవంతంగా తప్పించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. సదరు కీలకనేత చెప్పుకోవటానికి బీజేపీ నేతే అయినప్పటికీ పార్టీ ఎదుగుదలను పాతాళంలోకి తొక్కేశారు. కారణం ఏమిటంటే బీజేపీ పటిష్టమైతే తన ఆత్మీయనేతకు ఇబ్బందులు వస్తాయన్న ఆలోచనతోనే సొంతపార్టీనే ఎదగకుండా తొక్కిపెట్టేశారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి.



ఇప్పటికి కూడా బీజేపీలో ఉంటు సొంతపార్టీ ఎదుగుదలకోసం కాకుండా టీడీపీ పటిష్టానికి పాటుపడుతున్న నేతలున్న విషయం మోడీకి తెలీదా ? 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే వెంటనే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి ఎందుకు ఫిరాయించారు ? ఆ నలుగురు ఎవరుపంపితే బీజేపీలోకి ఫిరాయించారో అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళంతా ఇప్పటికీ బీజేపీలో ఉంటు టీడీపీ బలోపేతానికే కష్టపడుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. పార్టీలోని శల్యులను ముందు ఏరేస్తేకానీ బీజేపీ బలపడదని మోడీకి తెలీదా ?




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: